stealing data
-
నెల్లూరులో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ దొంగల ముఠా
-
ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరగాళ్లు కూడా అంతకంటే వేగంగా అడుగులు వేస్తున్నారు. గత సంవత్సరం గూగుల్ సంస్థ వినియోగదారుల భద్రత కోసం ఆధునిక ఫీచర్స్ పరిచయం చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని యాప్స్ యూజర్ల నుంచి ఎటువంటి డేటా సేకరిస్తున్నాయనే వివరాలు డేటా సేఫ్టీ అనే ఒక సెక్షన్లో తప్పకుండా వెల్లడించాల్సి ఉంది. అయితే దీనిని కూడా కొంత మంది హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'ప్రాడియో' అనే మొబైల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. కొందరు హ్యాకర్లు యూజర్ల డేటా దొంగలించడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఆ సమాచారం కొన్ని చైనా సంస్థలకు చేరవేస్తున్నట్లు తెలిసింది. నిజానికి చైనాకు చెందిన వాంగ్ టామ్ అనే డెవలపర్ డిజైన్ చేసిన 'ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ', 'ఫైల్ మేనేజర్' అనే రెండు యాప్స్ యూజర్ల డేటాని దొంగలిస్తున్నట్లు తెలిసింది. ఈ యాప్స్ రియల్ టైమ్ యూజర్ లొకేషన్, మొబైల్ కంట్రీ కోడ్, నెట్వర్క్ ప్రొవైడర్ పేరు, సిమ్ ప్రొవైడర్ వంటి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ రెండు యాప్‌లను దాదాపు 10 లక్షల కంటే ఎక్కువమంది మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఐఆర్సీటీసీ ఈ-టికెట్ & ఐ-టికెట్ గురించి మీకు తెలుసా?) ఇప్పటి వరకు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే తొలగించాలని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ యాప్‌లను సృష్టించిన సంస్థ మాత్రం తాము నిబంధనలను ఉల్లఘించలేదని, దానికి అనుకూలంగానే ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఇలాంటి యాప్‌ల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. -
ఆ యాప్స్‌పై ఓ షాకింగ్ న్యూస్!
గూగుల్ యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్ లేదా బ్యూటీ యాప్స్ వినియోగిస్తున్న యూజర్లకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల రీత్యా గూగుల్ కొన్ని యాప్‌లను డిలీట్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ను తొలగించినట్టు తాజాగా వెల్లడించింది. వీటి ద్వారా యూజర్ల డేటాకు భారీ ప్రమాదం ఉందన్న నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియాలో ముఖ్యంగా ఇండియాలో ప్రో కెమెరా బ్యూటీ, కార్టూన్ ఆర్ట్ ఫోటో, ఎమోజి కెమెరావంటి యాప్స్ కొన్ని లక్షలకు పైగా డౌన్లోడ్ అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. హానికరమైన ఈ యాప్స్ మాల్వేర్ను స్మార్ట్ఫోన్లలోకి పంపిస్తున్నాయంటూ అమెరికా ఆధారిత సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో గుర్తించింది. ప్లేస్టోర్‌లోని బ్యూటీ కెమెరా యాప్స్ రిమోట్ యాడ్ కాన్ఫిగ్యురేషన్ సర్వర్లను యాక్సెస్ చేయగలదని ట్రెండ్ మైక్రో తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ముఖ్యంగా ప్రో కెమెరా బ్యూటీ, ఎమొజీ కెమెరా, సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్డీ, ప్రిజ్మా ఫోటో ఎఫెక్ట్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి. వీటిద్వారా యూజర్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోందని పేర్కొంది. ఈ యాప్స్ డౌన్లోడ్ చేయగానే యూజర్లకు ఎలాంటి సందేహం రాకుండా.. గుర్తించలేనంతగా ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్ చేస్తుంది. దీని వలన ఈ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం కూడా కష్టతరం అవుతుందని వివరించింది. అంతేకాదు వీటిని ఎనలైజ్ చేయడానికి వీల్లేకుండా ప్యాకర్స్ను కూడా వాడుతుందట. -
వ్యక్తిగత రహస్యాలను తస్కరిస్తున్న యాప్స్!
వాషింగ్టన్: నిమిషాల్లో పనులవుతున్నాయని అందరం యాప్‌లను తెగ వినియోగించుకుంటున్నాం. కానీ అవి ఎంత వరకు సురక్షితమో ఒక్కసారి ఆలోచించండి. రెగ్యులర్‌గా వాడే యాప్‌లు మన వ్యక్తిగత వివరాలను తస్కరించే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక ఆన్లైన్లో జరిపే లావాదేవీలపై జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్స్ ఎంత వరకు సేఫ్ అనేదానిపై పరిశోధకులు అధ్యయనాన్ని జరిపారు. ఇందుకోసం దాదాపు 300పైగా యాప్‌లతోపాటు మన ఫోన్లోకి వైరస్‌లను పంపే మరో 9,994 మాల్వేర్ యాప్‌లను శాస్త్రవేత్తలు పరిశోధించారు. అయితే ఈ యాప్‌లలో ఎక్కువశాతం వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై వర్జినియా యూనివర్శిటికి చెందిన అసిస్టెంట్ ఫ్రోఫెసర్ గాంగ్ వాంగ్ మాట్లాడుతూ.. ఫేస్బుక్ , వాట్సప్ వంటి యాప్‌ల ద్వారా కాల్స్ చేసుకోవద్దని హెచ్చరించారు.