
యాప్‌కీ కహానీ క్యాష్‌కేర్
మీ వద్ద్ద క్రెడిట్ కార్డు లేదా? కానీ వాయిదాల్లో ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్ వంటి పలు వస్తువులను కొందామనుకుంటున్నారా? ఇంకేం ‘క్యాష్‌కేర్’ అనే యాప్‌ను ఉపయోగించి చూడండి. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
⇒ క్రెడిట్ కార్డు లేకుండానే ఈఎంఐ విధానంలో ఆన్‌లైన్‌లో ప్రొడక్టులను కొనుగోలు చేయవచ్చు.
⇒ అర్హతను బట్టి తక్షణ రుణ ఆమోదం. కనీస డాక్యుమెంట్లు ఉంటే చాలు.
⇒ రుణాన్ని 3–12 ఈఎంఐలలో చెల్లించొచ్చు.
⇒ షాప్‌క్లూస్ వంటి ఆన్‌లైన్ పోర్టళ్లలో షాపింగ్ చేయవచ్చు. లేదా క్యాష్‌కేర్ యాప్‌లోనే పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. నచ్చిన వాటిని కొనుగోలు చేయవచ్చు.