గూగుల్‌ అసిస్టెంట్‌ | Google Assistant | Sakshi
Sakshi News home page

గూగుల్‌ అసిస్టెంట్‌

Published Sun, Oct 15 2017 11:50 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

Google Assistant - Sakshi

బాస్‌లే కాదండోయ్‌.. మనం కూడా అసిస్టెంట్‌ను పెట్టుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్‌లో అండి. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్‌ ఇప్పటికే ‘గూగుల్‌ అసిస్టెంట్‌’ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌ పలు స్మార్ట్‌ఫోన్లలో డిఫాల్ట్‌గా కూడా ఉండొచ్చు. ఫోన్‌ హోమ్‌ బటన్‌ను నొక్కి పట్టుకుంటే ఇది ఓపెన్‌ అవుతుంది.  

ప్రత్యేకతలు
♦ ఏదైనా పనిలో ఉన్నా.. డ్రైవింగ్‌లో ఉన్నా.. త్వరితగతిన ఫోన్‌ కాల్స్‌ చేయవచ్చు. కాల్‌ మామ్‌ అని చెబితే వెంటనే అమ్మకు  ఫోన్‌ కాల్‌ వెళ్తుంది.
♦ అలాగే మెసేజ్‌లను కూడా పంపుతుంది.  
♦  స్నేహితుడి పుట్టిన రోజుకు బహుమతి కొనాలి అనుకుంటే.. ఆ బర్త్‌డే ఎప్పుడో రిమైండ్‌ సెట్‌ చేసుకోవచ్చు. దీనిలాగే ఇతర ముఖ్యమైన అంశాలను రిమైండ్‌లో పెట్టుకోవచ్చు. టేక్‌ సెల్ఫీ అని చెబితే సెల్ఫీ తీసి పెడుతుంది.  
♦  క్యాలెండర్‌ ఈవెంట్లను సెట్‌ చేసుకోవచ్చు.
♦  రూట్‌ డైరెక్షన్స్‌ చెబుతుంది. వాతావరణం గురించి తెలియజేస్తుంది.  
♦  యూట్యూబ్‌లో పాటలు ప్లే చేయంటే ప్లే చేస్తుంది.
♦  టెల్‌ మి ద న్యూస్‌ అని చెబితే తాజా వార్తలను తెలియజేస్తుంది.  
♦  ఈ యాప్‌ కొత్త ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ (6.0 మొదలు) కలిగిన ఫోన్లలోనే పని చేస్తుంది. ఫోన్‌లో గూగుల్‌ అసిస్టెంట్‌ ఉంటే మళ్లీ ఈ యాప్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement