మొబైల్ ఫోన్లలో వాడేందుకు తయారు చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను యాప్స్ అంటున్నాం. యాప్ ను అభివృద్ధి చేసి జనానికి అందుబాటులోకి తేవడానికి అనేక కంపెనీలు పోటీ పడుతుంటాయి. అయితే మనం వాడే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను బట్టి ఆయా యాప్ లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అత్యధిక వినియోగదారులతోపాటు ప్రజాభిమానం చూరగొంటున్న ఫేస్ బుక్...మొబైల్ అనువర్తనాల రేసులోనూ దూసుకుపోతోంది. అయితే 2015 కొత్త గణాంకాల ప్రకారం మాత్రం గూగుల్ టాప్ టెన్ లో అధిక భాగాన్ని ఆక్రమించుకొంది.
యాపిల్.. యాప్ స్టోర్ ను పరిచయం చేసిన వెంటనే ఐఫోన్ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా క్రమంగా కంప్యూటరీకరణలోనూ అనంతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా మొబైల్ మార్కెట్ పై అధిపత్యం కొనసాగించాయి. నీల్సన్ పరిశోధన ప్రకారం ఫేస్ బుక్ మొబైల్ యాప్ అన్నింటికంటే ఎక్కువగా 126 మిలియన్ల మంది ప్రత్యేక వినియోగదారులతో కొనసాగుతుండటమే కాక, ఈ సామాజిక నెట్ వర్క్ గత సంవత్సరం ఫేస్ బుక్ మెసెంజర్ కు సంబంధించిన మూడు యాప్ లతోనూ... ఇన్ స్టాగ్రామ్.. ఎనిమిది యాప్ ల తోనూ కొనసాగింది. అయితే ఈ సంవత్సరం టాప్ టెన్ లోని ఆ స్థానాన్ని గూగుల్ ఆక్రమించింది. అత్యధికంగా ఉపయోగించే పది యాప్ లలో ఐదు గూగుల్ వే ఉన్నట్లు మౌంటైన్ వ్యూ పరిశోధనల ఆధారంగా తెలుస్తోంది.
ఇకపోతే యూట్యూబ్ 97 మిలియన్లపైగా వినియోగదారులతో రెండో స్థానంలో నిలువగా.. జీ మెయిల్ ఛార్ట్ కు మధ్య స్థానంలోకి చేరిపోయింది. యాపిల్ సంస్థ అధీనంలోని యాపిల్ మ్యూజిక్, ఆపిల్ మ్యాప్స్ యాప్ లు చివరిస్థానంతోనే సరిపెట్టుకున్నాయి. అయితే మొట్ట మొదట మొబైల్ యాప్ స్టోర్ ను పరిచయం చేసిన యాపిల్... ఇప్పటికీ గూగుల్ మ్యాప్స్ ను అధిగమించేందుకు యాపిల్ మ్యాప్స్, గూగుల్ ప్లే ను అధిగమించేందుకు యాపిల్ మ్యూజిక్ తనూ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే చాలామంది ఇతర యాప్స్ కూడ వాడుతున్నప్పటికీ ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు యాప్ వాడకానికి డబ్బు వినియోగంతోపాటు... తమ ఉచిత సేవలను కూడ అంది స్తుండటంతో మొబైల్ వ్యాపార రంగంలోనూ జోరుగా దూసుకుపోతున్నాయి.