గూగుల్ ‘ఐడియా’ విజేతకు రూ.3 కోట్లు | Google shortlists 10 ideas for Rs 3 cr award | Sakshi
Sakshi News home page

గూగుల్ ‘ఐడియా’ విజేతకు రూ.3 కోట్లు

Published Tue, Oct 22 2013 1:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

Google shortlists 10 ideas for Rs 3 cr award

 న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ నిర్వహిస్తున్న సృజనాత్మక ఆలోచనల పోటీల్లో 10 సలహాలకు తుది జాబితాలో చోటు దక్కింది. ఇందులో అత్యుత్తమమైన 4 ఆలోచనలను ఎంపిక చేసి రూ.3 కోట్ల చొప్పున బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గ్రామీణ విద్య, వ్యవసాయ అభివృద్ధి, పరిశుభ్రత తదితర అంశాలపై చేసిన సూచనలకు ఈ జాబితాలో స్థానం లభించింది. ఢిల్లీలో పేరుకుపోతున్న ఈ వ్యర్థాల చెత్తను నివారించేందుకు ఆన్‌లైన్ మార్కెట్‌ను వృద్ధి చేసి మొబైల్ యాప్స్ ద్వారా సేకరించటం కూడా ఇందులో ఒకటి. వ్యవసాయ ఖర్చులు తగ్గించుకుని దిగుబడి పెంచటంపై రైతులకు ఆన్‌లైన్‌లో మెళకువలు నేర్పటం కూడా ఇందులో ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భారత్, ప్రపంచాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దటంపై గూగుల్ ఈ ఏడాది ఆగస్టులో సూచనలను ఆహ్వానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement