
ఉమాంగ్
ప్రభుత్వపు ఈ–గవర్నెన్స్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ‘ఉమాంగ్’ యాప్‌ను తీసుకువచ్చింది. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు అందించే వివిధ రకాల సేవలన్నింటినీ ఈ యాప్ ద్వారా పొందొచ్చు. కాగా ఉమాంగ్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
♦ ఇది యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. ప్రభుత్వ విభాగాలు, వాటి సేవలన్నింటినీ ఈ మొబైల్ యాప్ ద్వారా పొందొచ్చు.
♦ ఇందులో ఆధార్, డిజిలాకర్, పేగౌ వంటి పలు డిజిటల్ ఇండియాæసేవలు కూడా అందుబా టులో ఉన్నాయి.
♦ ప్రభుత్వ సేవలను ప్రజలు సులభంగా వినియోగించుకోవాలనేదే ఈ యాప్ లక్ష్యం.
♦ యాప్ డేటా భద్రతకు ఢోకాలేదని ప్రభుత్వం పేర్కొంది.
♦ హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎనర్జీ, అగ్రికల్చర్, ట్రాన్స్‌పోర్ట్, యుటిలిటీ, ఎంప్లాయిమెంట్ వంటి పలు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ళీ ఈ యాప్‌ను తెలుగు భాషలోనూ ఉపయోగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment