యాప్స్‌ ద్వారా ఫండ్స్‌ కొనుగోళ్లు సురక్షితమేనా? | Mutual fund units | Sakshi
Sakshi News home page

యాప్స్‌ ద్వారా ఫండ్స్‌ కొనుగోళ్లు సురక్షితమేనా?

Published Mon, Jun 26 2017 1:11 AM | Last Updated on Fri, Oct 19 2018 7:00 PM

యాప్స్‌ ద్వారా ఫండ్స్‌ కొనుగోళ్లు సురక్షితమేనా? - Sakshi

యాప్స్‌ ద్వారా ఫండ్స్‌ కొనుగోళ్లు సురక్షితమేనా?

మొబైల్‌ యాప్స్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయవచ్చా? ఇలా కొనుగోలు చేయడం ఎంత వరకు సురక్షితం?
  –సుచరిత, హైదరాబాద్‌

మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను వివిధ యాప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే మొబైల్‌ యాప్‌ల ద్వారా మొబైల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేసేటప్పుడు.. మీరు రెగ్యులర్‌ ప్లాన్‌ యూనిట్లను కొనుగోలు చేస్తున్నారా ? లేక డైరెక్ట్‌ ప్లాన్‌ యూనిట్లను కొనుగోలు చేస్తున్నారా అనే విషయాన్ని గమనించాలి. ఉదాహరణకు ఫండ్స్‌ఇండియా, స్క్రిప్‌బాక్స్‌ అనే మొబైల్‌యాప్‌లను ఉపయోగిస్తే రెగ్యులర్‌ ప్లాన్‌ యూనిట్లను కొనుగోలు  చేయవచ్చు. మొబైల్‌ యాప్‌లు, లేదా ఇతర ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను కొనుగోలు చేయడం సురక్షితమేనని చెప్పవచ్చు. మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల కొనుగోలు కోసం మీరు పంపించే సొమ్ములు ఆ యాప్‌లకు కాకుండా ఫండ్‌హౌస్‌లకు చేరతాయి. మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయడానికి మ్యూచువల్‌ ఫండ్‌ యుటిలిటిస్‌ మంచి సౌకర్యవంతమైన, సురక్షితమైన మార్గం. ఈ ‘మ్యూచువల్‌ ఫండ్‌ యుటిలిటిస్‌’ పోర్టల్‌  ద్వారా వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అంతేకాకుండా యూనిట్లను విక్రయిస్తే, ఆ సొమ్ములు నేరుగా మీ బ్యాంక్‌ ఖాతాలోకి వచ్చేస్తాయి. మొబైల్‌ యాప్‌ల ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ క్రయ, విక్రయ లావాదేవీలు నిర్వహిస్తే, సదరు యాప్‌ల ద్వారానే కాకుండా ఆ ఫండ్‌హౌస్‌కు సంబంధించిన రిజిస్ట్రార్ల ద్వారా కూడా మీకు సమాచారం వస్తుంది.

ఆల్ట్రాషార్ట్‌టర్మ్‌ ఫండ్స్‌ అంటే ఏమిటి?  ఈ ఫండ్స్‌కు లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంటుందా? సేవింగ్స్‌ ఖాతాలో పెద్ద మొత్తంలో ఉన్న డిపాజిట్లను విత్‌గ్రా చేసి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్‌ చేయడానికి కొన్ని ఆల్ట్రాషార్ట్‌టర్మ్‌ ఫండ్స్‌ను సూచించండి.
–వికాస్, విజయవాడ

ఏడాది కంటే తక్కువ మెచ్యూరిటీ ఉండే సెక్యూరిటీల్లో ఆల్ట్రాషార్ట్‌టర్మ్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. కొన్ని నెలల నుంచి ఏడాది కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే.. ఈ ఫండ్స్‌.. మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫండ్స్‌ గ్యారంటీగా ఇంత రాబడులనిస్తాయని,  మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితమని చెప్పలేము. అయినప్పటికీ, ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఏమంత రిస్క్‌ కాదని చెప్పవచ్చు. సేవింగ్స్‌ ఖాతా కంటే కూడా కొంచెం అధిక రాబడులను పొందవచ్చు. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్‌–ఇన్‌ పీరియడ్‌ లేదు. రిడంప్షన్‌ రిక్వెస్ట్‌ సమర్పించిన 1 లేదా 2 రోజుల్లోనే మీరు మీ సొమ్ములను పొందవచ్చు. కొన్ని ఫండ్‌హౌజ్‌లు తక్షణ రిడంప్షన్‌ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్‌ ఖాతాలోనే ఉంచి మిగిలిన మొత్తాన్ని ఈ ఆల్ట్రాషార్ట్‌టర్మ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. డెట్‌ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే ఈ ఫండ్స్‌కు కూడా వర్తిస్తాయి.  మూడేళ్లలోపు ఈ ఫండ్స్‌ యూనిట్లను విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ యూనిట్ల విక్రయంపై వచ్చిన లాభాన్ని మీ మొత్తం ఆదాయానికి కలిపి,  మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత ఫండ్స్‌ను విక్రయిస్తే, వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై 20 శాతం పన్ను(ఇండెక్సేషన్‌ ప్రయోజనంతో) విధిస్తారు. ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం కింద ఉదహరించిన ఆల్ట్రాషార్ట్‌టర్మ్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఫ్రాంక్లిన్‌ ఇండియా ఆల్ట్రాషార్ట్‌ బాండ్‌ ఫండ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏఎక్స్‌ఏ ట్రెజరీ అడ్వాండేజ్‌ ఫండ్, బరోడా పయనీర్‌ ట్రెజరీ అడ్వాండేజ్,  కోటక్‌ లో డ్యూరేషన్‌ ఫండ్‌–స్టాండర్డ్‌ ప్లాన్‌.

నేను వ్యాపారం చేస్తున్నాను. నెలవారీగా నిర్దేశిత మొత్తంలో ఆదాయం రాదు. ఒక్కో నెలలో పెద్ద మొత్తం ఆదాయం వస్తుంది. ఒక్కోసారి మూడు నెలల వరకూ ఎలాంటి ఆదాయమూ రాదు. నాలాంటి వాళ్లు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానాన్ని ఎలా అనుసరిస్తారు? మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి?
– రఘు, విశాఖపట్టణం

నెలవారీగా నిర్దేశిత మొత్తాల్లో ఆదాయం రానివాళ్లు ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక నెలలో రూ. లక్ష ఆదాయం వచ్చిందనుకుందాం. తర్వాత 3 నెలల వరకూ ఎలాంటి ఆదాయం రాలేదనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం మీరు షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌ను గానీ, ఆల్ట్రాషార్ట్‌టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌ను గానీ ఎంచుకోవాలి. పెద్ద మొత్తంలో ఆదాయం రాగానే వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలి.  ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్స్‌ నుంచి మూడు నుంచి ఆరు నెలల కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి బదిలీ చేసుకోవాలి. మీకు ప్రతి నెలా పెద్దమొత్తంలో ఆదాయం వచ్చిందనుకుందాం. అప్పుడు ప్రతి నెలా పెద్దమొత్తంలోనే ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఆదాయం రాని నెలల్లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేయకపోయినా పర్వాలేదు.

వడ్డీరేట్లు 9–10 శాతం రేంజ్‌లో ఉన్నప్పుడు మల్టీక్యాప్‌ ఫండ్స్‌12–18 శాతం రాబడులనిచ్చాయి. ఇప్పుడు వడ్డీరేట్లు 6–7 శాతం రేంజ్‌కు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో 12–15 శాతం రాబడులు ఆశించవచ్చా?
– జావేద్, బెంగళూరు

మన ఆర్థిక వ్యవస్థ, మన కంపెనీల పనితీరు ఎలా ఉంటుందనే అంశాలపై మల్టీక్యాప్‌ ఫండ్స్‌ రాబడులు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత సంస్కరణల కారణంగా మల్టీక్యాప్‌ ఫండ్స్‌ భవిష్యత్తులో మంచి రాబడులే ఇస్తాయని చెప్పవచ్చు. మల్టీక్యాప్‌ ఫండ్స్‌  15–20 ఏళ్ల క్రితం ఎంతైతే రాబడులనిచ్చాయో, అంతకు మించి భవిష్యత్తులో
రాబడులనిచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement