
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తాజాగా తన ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో, ఎక్కువ కంటెంట్‌తో ఈ యాప్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, ప్రి–పెయిడ్ కస్టమర్లు యాప్‌లోని కంటెంట్‌ను ఫ్రీ–సబ్‌స్క్రిప్షన్ విధానంలో 2018 జూన్ వరకు ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. సంస్థ యూజర్లు ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను వారి స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.
ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌పై పనిచేస్తుంది. ‘ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో 29 హెచ్‌డీ చానళ్లు సహా 300లకు పైగా లైవ్ టీవీ చానళ్లు అందుబాటులో ఉన్నాయి. 6,000కు పైగా సినిమాలు, ప్రముఖ టీవీ షోలు చూడొచ్చు. ప్రాంతీయ వినియోగదారుల కోసం రీజినల్ కంటెంట్‌ను కూడా పొందుపరిచాం’ అని వివరించింది. ఎయిర్‌టెల్ టీవీ ప్రస్తుతం ఈరోస్ నౌ, సోనీ లైవ్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా ఎయిర్‌టెల్‌కు 28.2 కోట్లకుపైగా మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment