
ఇంటర్నెట్‌లో, హెల్త్ యాప్‌లలో ఆరోగ్యపరమైన చిట్కాలు పాటిస్తూ అనేకమంది ఎలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారో ఈ సంఘటనలే పెద్ద ఉదాహరణ. ఇంటర్నెట్‌లో హెల్త్‌కు సంబంధించి సెర్చ్ చేస్తే కుప్పలు తెప్పలుగా సైట్లు, వీడియోలు, సమాచారం వస్తుంది. అలాంటి వాటిని నమ్మడం మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రసిద్ధి చెందిన వైద్యుల వీడియోలు, యాప్‌లను తప్ప ఇతరత్రా పాటించడం మంచిది కాదంటున్నారు. కొందరు వైద్యశాస్త్రాన్ని నమ్మకుండా చిట్కాలు పాటిస్తూ అవాం తరాలు తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల హెల్త్ యాప్‌లు, వెబ్‌సైట్లు ఉన్నాయి. కొన్ని యాప్‌లు ఎక్సర్‌సైజుకు సంబంధించినవి కాగా, కొన్ని ఆహార నియమాలకు సంబంధించినవి.
కొన్నింటిలో ఏ జబ్బుకు ఏ మందులు వాడాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఉన్నాయి. కొన్ని ఆన్‌లైన్ వీడియోల్లోనైతే ఆరోగ్య చిట్కాల పేరుతో వందల సైట్లు కనిపిస్తుంటాయి. ఇంటర్నె ట్ విస్తృతి అదనుగా ప్రవేశించిన ఈ మాయదారి యాప్‌లు, వెబ్‌సైట్‌లు కిడ్నీలో రాళ్లు వస్తే ఈ చిట్కాలు పాటించండి.. బరువు ఎక్కువుంటే ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజుల్లో 10 కేజీలు తగ్గుతాయ ని చెబు తుంటాయి. కామెర్లు వస్తే పలానా ఆకురసం తాగాలి వంటివి కనిపిస్తాయి. పాత తరం వాళ్లు ఇలాం టివి పాటించడం వల్లే వారు ఆరోగ్యంగా ఉన్నారని కూడా నమ్మబలుకుతున్నాయి. ఇటువంటి వీడియోలు చూసి మోసపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
శరీరంపై ప్రయోగాలు చేయొద్దు..
మానవ శరీరంపై ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేయకూడదన్న కీలకమైన విషయాన్ని వైద్యులు సూచిస్తున్నారు. మనిషి మనిషికి వారి అలవాట్లలో తేడాలుం టాయి. వారి శరీర నిర్మాణంలోనూ తేడాలుంటాయి. కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే సరిపడదు. వారికి అలర్జీలు వస్తాయి. కొందరికి కొన్ని రకాల మందులు కూడా సరిపడవు. ప్రతి మనిషి వారి వాతావరణ పరిస్థితులు, చిన్నప్పటి నుంచి వారి ఆహా ర అలవాట్లను బట్టి అనేక రకాల తేడాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా జబ్బు కానీ, అనారోగ్య సమస్యగానీ వస్తే డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కొందరు షుగర్ పరీక్షలు చేయించుకుంటారు. సాధారణం కంటే కాస్తంత ఎక్కువ కనిపిస్తే తనకు షుగర్ ఉందని ఫిజీషి యన్‌ను కలవకుండానే నిర్ధారించుకుంటారు. కొంద రు అర్హతలేని ప్రైవేటు ప్రాక్టీషనర్‌ను కలిసి మందులు కూడా వాడతారని వైద్యులు చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వస్తే సరే..
ప్రస్తుతం యాప్‌లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ వీడియోలు సాధారణ లక్షణాలను మాత్రమే చెబుతుం టాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మున్ముం దు యాప్‌లు రానున్నాయి. అవి కొంతమేరకు ప్రాక్టికల్‌గా ఉండే అవకాశముందని వైద్యులు అంటున్నారు. ఏదేమైనా వైద్యుడిని సంప్రదించకుండా ఆన్‌లైన్ వైద్యం ఏమాత్రం మంచిదికాదని స్పష్టం చేస్తున్నారు.
ఒక్కోసారి ప్రాణాంతకం
యాప్‌లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ వీడియోలను చూసి వైద్యం చేసుకుంటే ఇక వైద్యులు ఎందుకు? నెట్ ఆధారంగా వైద్యం చేసుకోవడం, చిట్కాలు పాటించడం అశాస్త్రీయం. ప్రాణాంతకం కూడా. పైగా దుష్ప్రభావాలు వస్తుంటాయి.
– డాక్టర్ పుట్టా శ్రీనివాస్,డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ
గుడ్డిగా అనుకరించొద్దు
యాప్‌లు, వెబ్‌సైట్లలో ఆరోగ్య సమాచారం చూసి గుడ్డిగా ఫాలోకాకూడదు. వైద్యుల ప్రమేయం లేకుండా ఆహారంలో మార్పులు చేర్పులు అనవసరంగా చేయకూడదు. దీనివల్ల మన శరీర సహజ లక్షణం మారిపోతుంది.
– డాక్టర్ కృష్ణ ప్రభాకర్, పిజీషియన్,సిటీన్యూరో, హైదరాబాద్
ప్రయోగాలు వద్దు
డాక్టర్ సలహా లేకుండా ఎవరూ శరీరంపై ఎలాంటి ప్రయోగం చేయకూడదు. ఆహార విషయమైనా, వైద్యమైనా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు.
– డాక్టర్ రాజు, ఛాతీ వైద్య నిపుణులు,హైదరాబాద్
ట్యూమర్ అనుకుంటే ఎలా
కొందరు సాధారణ తలనొప్పి వచ్చినా, వెబ్‌సైట్లలో వెతికితే బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చని కూడా ఉంటుంది. దాన్ని నమ్మి ఎంఆర్‌ఐ స్కాన్ తీయించుకుంటున్న వారూ ఉంటున్నారు. వెబ్‌సైట్లను నమ్మి ప్రమాదకరమైన వాటిని కూడా చిన్నవిగా చూసే పరిస్థితి కూడా ఉంటుంది.
–డాక్టర్ సాంబశివారెడ్డి, సిటీన్యూరో,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment