
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ టాగోన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ‘గోల్డ్ పిల్లర్’ పేరిట రియల్ ఎస్టేట్ వెబ్, యాప్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన పోలార్ ఐటీ సర్వీసెస్‌కు చెందిన డెవలప్‌మెంట్ సెంటరే టాగోన్ సాఫ్ట్‌వేర్. సోమవారమిక్కడ విలేకరులతో పోలార్ ఐటీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ రఘు పాటిబండ్ల మాట్లాడుతూ.. గోల్డ్ పిల్లర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డెవలపర్లు, కస్టమర్లకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందన్నారు.
ప్రస్తుతం దేశంలో సంఘటిత, అసంఘటిత రంగం కలిపి సుమారు 3 లక్షల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారని వీరందరినీ గోల్డ్‌పిల్లర్ అప్లికేషన్ పరిధిలోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఏజెంట్లు, డెవలపర్లు ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలను ఉచితంగా నమోదు చేసుకోవటంతో పాటూ కస్టమర్ల నుంచి లీడ్స్ పొందే వీలుంటుందని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment