పేసెన్స్‌ | Paysense: Marrying tech, data to offer loans on tap | Sakshi
Sakshi News home page

పేసెన్స్‌

Published Sun, Jul 9 2017 11:28 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

పేసెన్స్‌ - Sakshi

పేసెన్స్‌

యాప్‌కీ కహానీ...
రవి ల్యాప్‌టాప్‌ కొందామనుకున్నాడు. అది అతనికి చాలా అవసరం. కానీ రవి వద్ద డబ్బులు లేవు. అప్పుడు తెలిసిన వారిని సాయమడిగాడు. వారేమో ఒట్టి చేతులు చూపించారు. సరిగ్గా అదే సమయంలో రవి స్నేహితుడైన వలి అతనికి ‘పేసెన్స్‌ యాప్‌’ గురించి చెప్పాడు. దీని సాయంతో రవి ల్యాప్‌టాప్‌ కొని తన సమస్య నుంచి గట్టెక్కాడు. ఇక్కడ రవి ‘పేసెన్స్‌’ అనే యాప్‌ ద్వారా రుణం పొందాడు. దీని ద్వారా తనకు కావాల్సిన ప్రొడక్ట్‌ను కొన్నాడు. ఇక పేసెన్స్‌ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
యూజర్‌ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌.
దీని ద్వారా రూ.5,000–రూ.1,00,000 వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగం చేస్తున్నవారు వెంటనే లోన్‌ కోసం అప్లై చేయవచ్చు. సరళ విధానంలో 4–7 రోజుల్లో రుణాన్ని పొందొచ్చు. ఇది డైరెక్ట్‌గా మన బ్యాంక్‌ ఖాతాకు వచ్చి చేరుతుంది.
తీసుకున్న రుణాన్ని సులభమైన ఈఎంఐల రూపంలో
తిరిగి చెల్లించవచ్చు.
చెన్నై, బెంగళూరు, ముంబై సహా పది పట్టణాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లోనూ పేసెన్స్‌ కార్యకలాపాలు ప్రారంభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement