
హైదరాబాద్ :
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్, తెలుగు తేజం పీవీ సింధు తన అధికారిక మొబైల్ యాప్ ను బుధవారం ప్రారంభించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో మొబైల్ యాప్ను ప్రారంభించినట్టు సింధు పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
'నా అధికారిక మొబైల్ యాప్ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్లలో పీవీ సింధు అధికారిక యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకొని నాతో కనెక్ట్ అవ్వండి అంటూ' సింధు ట్విట్ చేశారు. మొబైల్ యాప్కు సంబంధించి లింక్ను కూడా పోస్ట్ చేశారు.
ఈ యాప్ ద్వారా అభిమానులు సింధు పోస్ట్ చేసిన వీడియోలు, ఆమె పోస్టులను తిలకించవచ్చు. అంతేకాకుండా పీవీ సింధుతో యాప్ ద్వారా లైవ్ చాట్ చేసే అవకాశం కూడా ఉంది. యాప్లో సింధు తొలి వీడియోను పోస్ట్ చేశారు. తనకు అండగా ఉంటూ తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నందకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. యాప్ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని తన అభిమానులను ఆమె కోరారు. పీపీ సింధు మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్ను క్లిక్ చేయండి.. smarturl.it/pvsindhu
Hey guys, I'm extremely excited to announce the launch of my official app. PV SINDHU OFFICIAL APP is now available on iOS & Android. Go Download it immediately and connect with me!
— Pvsindhu (@Pvsindhu1) December 27, 2017
Just go to https://t.co/9VCIBHCqa6#PvSindhuOfficialApp pic.twitter.com/2nCiGIWGpn
Comments
Please login to add a commentAdd a comment