
ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లు ఉపయోగించొచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఈ ‘పారలల్ స్పేస్–మల్టీ అకౌంట్స్’ యాప్‌తో. కేవలం వాట్సప్ మాత్రమే కాదు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వంటి పలు యాప్‌లను క్లోన్ చేసుకొని రెండు అకౌంట్లు ఉపయోగించొచ్చు.
ప్రత్యేకతలు
♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
♦ ఒక స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్/గేమ్స్/ఇతర యాప్స్ మల్టీపుల్ అకౌంట్స్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.
♦ ఫోన్‌లోని వాట్సప్ యాప్‌లో ఒక నెంబర్‌పై అకౌంట్ ఉంటుంది. ఇక పారలల్ యాప్‌లో వేరొక నెంబర్‌పై రెండో వాట్సప్ అకౌంట్‌ను ఉపయోగించొచ్చు. దీనిలాగే ఫేస్‌బుక్ కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసుకోని లాగిన్ అవ్వొచ్చు.
♦ యాప్‌కు పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు.
గమనిక: పలు సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్‌లో ఒకే నెంబర్‌పై రెండు అకౌంట్లను ఉపయోగించడం కుదరదు. ఇకపోతే పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వాటి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో రెండు అకౌంట్లను ఉపయోగించేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. ఉదాహరణకు హువావే కంపెనీ తన హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్ అకౌంట్లను ఉపయోగించేందుకు యాప్ ట్విన్ అనే ఫీచర్‌ను పొందుపరిచింది. దీని వల్ల రెండేసి వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్ యాప్‌లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిల్లోకి వేర్వేరు అకౌంట్లతో లాగిన్ అవ్వొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment