
డేటాలీ
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా మొబైల్ డేటా సేవింగ్, వై–ఫై యాప్ ‘డేటాలీ’ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని సాయంతో యూజర్లు వారి మొబైల్ డేటా వినియోగాన్ని నియంత్రించుకోవచ్చు. రియల్‌టైమ్‌లో డేటా యూసేజ్‌ను ట్రాక్ చేయవచ్చు. డేటా ఆదా చేసుకునేందుకు పర్సనలైజ్డ్ సిఫార్సులు పొందొచ్చు. పబ్లిక్ వై–ఫై స్పాట్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. డేటాలీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఈ మొబైల్ డేటా మేనేజర్ యాప్ కేవలం ఆండ్రాయిడ్ 5.0, ఆపై ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్‌ఫోన్లపై మాత్రమే పనిచేస్తుంది. ‘ప్రపంచంలో చాలా మందికి మొబైల్ డేటా చాలా ఖరీదైన వ్యవహారంగానే ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ డేటా ఎలా ఖర్చవుతోందన్నది అర్థం కాదు. అందుకే మేం డేటాలీని రూపొందించాం. ఇది మీరు మీ డేటాను నియంత్రించుకునేందుకు, మరింత ఆదా చేసుకునేందుకు దోహదపడుతుంది’ అని గూగుల్ నెకట్స్ బిలియన్ యూజర్స్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా వివరించారు.
ప్రత్యేకతలు
డేటా వినియోగం: డేటా వినియోగాన్ని గంట, రోజు, వారం, నెల ప్రాతిపదికన చూసుకోవచ్చు. డేటా మరింత ఆదాకు వ్యక్తిగత సిఫార్సులు కూడా పొందొచ్చు .
డేటా నియంత్రణ : బ్యాక్‌గ్రౌండ్ డేటా యూసేజ్‌ను బ్లాక్ చేసుకునేందుకు, రియల్‌టైమ్ డేటా యూసేజ్‌ను ట్రాక్ చేసేందుకు డేటా సేవర్ బబుల్‌ను ఆన్ చేసుకోవాలి. ఇది మీ డేటాకు స్పీడోమీటర్ లాంటిది. ఒక యాప్ డేటా యూసేజ్ నియంత్రణ దాటితే ఒక్క ట్యాప్‌తో డేటాను బ్లాక్ చేయవచ్చు.
డేటా ఆదా: కొన్ని సందర్భాల్లో మీకు మీ డేటా ప్లాన్‌పై పొందిన డేటా కన్నా కొంత ఎక్కువగానే అవసరమౌతుంది. అలాంటి సందర్భాల్లో డేటాలీ మీకు దగ్గరిలోని పబ్లిక్ వై–ఫై గురించి తెలియజేసి కనెక్ట్ అయ్యేందుకు తోడ్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment