e-challan
-
కేవలం 4 నెలల్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఎన్ని లక్షలు ఫైన్ కట్టారో తెలుసా!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు స్పీడ్ గన్ ద్వారా చేసిన తనిఖీల్లో 3,740 కేసులు నమోదు చేశామని డీటీసీ రాజారత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా రూ.38.88 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఈ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. చదవండి: అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు 15 రోజుల్లోగా ఈ–చలాన్
న్యూఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇకపై 15 రోజుల్లోగా నోటీసు(ఈ–చలాన్) జారీ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నోటీసును వాహనదారుడికి చేరవేయాలి. చలాన్ సొమ్మును వాహనదారుడు చెల్లించేదాకా సదరు ఎలక్ట్రానిక్ రికార్డును భద్రపర్చాలి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహన చట్టం–1989కు ఇటీవల సవరణ చేయడం తెల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, శరీరంపై ధరించే కెమెరా, స్పీడ్ గన్, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వంటి సాంకేతిక పరికరాలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. అధికంగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కీలకమైన జంక్షన్లు, నోటిఫికేషన్లో ప్రస్తావించిన 132 నగరాలతోపాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా, హైవేల శాఖ సూచించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. నోటిఫై చేసిన నగరాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 నగరాలు ఉన్నాయి. -
చలానాతో.. పోయిన బైక్ తిరిగొచ్చింది!
సాక్షి, ఆదోని: జరిమానా అంటే సహజంగా బాధ కలిగించే విషయమే. అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన పురుషోత్తంకి మాత్రం జరిమానా ఖుషీ కలిగించింది. అదెలాగంటే... పట్టణానికి చెందిన పురుషోత్తం 2018 మార్చిలో ఎస్కేడీ కాలనీలోని తన గది ముందు హీరో స్ప్లెండర్ బైక్ నిలిపి ఉంచాడు. కొద్దిసేపటికే అది అపహరణకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది గడిచినా బైక్ ఆచూకీ దొరకలేదు. ఇక దొరకదేమోనని ఆశ వదులుకున్నాడు. అయితే మూడు రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తూ పట్టుబడినందున, నిర్ణీత కాల వ్యవధిలో రూ.1,235 జరిమానా చెల్లించాలని అందులో ఉంది. వెంటనే ఈ విషయం టూటౌన్ సీఐ అబ్దుల్ గౌస్ దృష్టికి తీసుకెళ్లాడు. సీఐ స్పందించి మెసేజ్ ఏ పోలీసు స్టేషన్ పరిధి నుంచి వచ్చిందో గుర్తించి.. కోసిగి పోలీసులను సంప్రదించారు. వారు బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని సీఐ వద్దకు పంపించారు. ఏడాది తరువాత తన బైక్ తిరిగి దక్కడంతో పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశాడు. -
జేసీ వాహనానికి జరిమానా
సాక్షి, మంచిర్యాల : చట్టానికి ఎవరు అతీతులు కాదు.. నిబంధనలు అందరికీ సమానమే అని స్పీడ్ లేజర్ గన్ (కెమెరా) ద్వారా స్పష్టమైంది. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌కు చెందిన టీఎస్19సీ1009 నంబర్ గల వాహనానికి ఈ నెల 28న సైబర్‌బాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట వద్ద స్పీడ్ లేజర్ గన్‌తో జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్‌శాఖ వాహనాల అతివేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ లేజర్ గన్ను అందుబాటులోకి తెచ్చారు. రహదారులపై నిర్ధేశించిన వేగానికంటే అధికవేగంతో వెళ్తే స్పీడ్ లేజర్ గన్ పసిగడుతుంది. దీంతో ఈ–చలాన్ ద్వారా జరిమానా విధించడం జరుగుతోంది. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ వాహనం అతివేగంగా వెళ్లడంతో స్పీడ్ లేజర్ గన్ ద్వారా రూ.1035 జరిమానా విధించారు. -
నొక్కేస్తే.. పట్టేస్తారు..!
►చెకింగ్స్‌పై నజర్! ►ఈ–చలాన్ల తనిఖీలో సిబ్బంది చేతివాటం ►వాహనచోదకుల నుంచి డబ్బు వసూలు ►సర్వర్‌తో పీడీఏ మిషన్ల అనుసంధానం ఇప్పటికే కొందరు ► అక్రమార్కుల గుర్తింపు సిటీబ్యూరో: ఉల్లంఘనలకు పాల్పడి ఈ–చలాన్లు భారీగా పెండింగ్‌లో ఉన్న వాహనచోదకులపై ట్రాఫిక్ విభాగం అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దీనిని కొందరు సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుంటూ ‘క్యాష్’ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చెకింగ్స్ పైనా కన్నేసి ఉంచుతున్నారు. ఈ నిఘాలో పట్టుబడిన కొందరిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. పెరిగిపోతున్న పెండింగ్ చలాన్లు... ట్రాఫిక్ ఉల్లంఘనులకు జరిమానా విధించే విషయంలో ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ–చలాన్లు పంపిస్తున్నారు. వీటిని ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు ఆర్టీఏ డేటాబేస్‌లో అప్డేట్ కాలేదు. దీంతో వారికి ఈ–చలాన్లు అందక తమ వాహనంపై చలాన్ జారీ అయిందనే విషయం యజమానికి తెలియట్లేదు. మరికొందరు ఉల్లంఘనులకు తమ వాహనంపై చలాన్ పెండింగ్‌లో ఉందని తెలిసినా.. ఉద్దేశపూర్వకంగా జరిమానా చెల్లించడంలేదు. రహదారులపై అడ్డంగా ‘బాదుడు’... దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు పెండింగ్ ట్రాఫిక్ ఈ–చలాన్ల డేటాబేస్‌ను అధికారుల వద్ద ఉండే పీడీఏ మిషన్లకు అనుసంధానించారు. ఈ మిషన్లతో రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ ఈ–చలాన్లు ఉన్న వాహనాలను గుర్తిస్తున్నారు. భారీ మొత్తం పెండింగ్‌లో ఉంటే వాహనం స్వాధీనం చేసుకోవడం, బకాయి మొత్తం చెల్లించిన తర్వాతే వదిలిపెట్టడం చేస్తున్నారు. దీంతో ఈ–చలాన్ల వసూలు మాట ఎలా ఉన్నా.. కొందరు సిబ్బంది మాత్రం భారీగా వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనచోదకుల నుంచి డబ్బు తీసుకుని జరిమానా చెల్లించకుండానే వారిని పంపేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో వాహనచోదకుల్ని బెదిరిస్తూ అందినకాడికి తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సర్వర్‌తో అనుసంధానం... వీటిని దృష్టిలో ఉంచుకున్న ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు చెకింగ్స్‌పై సాంకేతిక నిఘా అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగించే ప్రతి పీడీఏ మిషన్‌ను సర్వర్‌తో అనుసంధానించడంతో పాటు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతో ఒక్కో పీడీఏ మిషన్ ఆ రోజు ఎన్ని వాహనాల వివరాలు తనిఖీ చేసింది? వాటిలో ఎన్నింటిపై ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి? స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎన్ని? బకాయి తీర్చేలా చర్యలు తీసుకున్నవి ఎన్ని? అనేది ఓ నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందుతోంది. దీని ఆధారంగా ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలను గుర్తించి, విడిచిపెట్టడానికి కారణాలపై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హోంగార్డు చేతివాటం వెలుగులోకి రావడంతో అతడిపై చర్యలకు సిఫార్సు చేశారు. మరికొందరి పాత్ర పైనా అధికారులకు ప్రాథమిక ఆధారాలు అందినట్లు తెలిసింది. వీరిపైనా చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. -
‘ఈ-చలాన్ల’ చెల్లింపు గడువు పెంపు
ఈ నెల 24 వరకు అవకాశం: ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.వెరుు్య నోట్లను వినియోగించి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లు చెల్లించుకునే అవకాశాన్ని 10 రోజుల పాటు పొడిగిం చినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ మంగళవారం వెల్లడించారు. తొలుత ఆదివారం నుంచి 48 గంటల ఇచ్చిన అవకాశం సోమవారం సాయంత్రంతో ముసిగింది. రెండు రోజుల కాలంలో 7,013 మంది వాహనచోదకులు రూ.13.53 లక్షలు చెల్లించారు. ట్రాఫిక్ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ.40 కోట్ల మేర ట్రాఫిక్ ఈ-చలాన్ల బకారుులు ఉన్నారుు. పాత కరెన్సీతో చెల్లింపు గడువు పెంచితే మరింత మందికి ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ నెల 24 వరకు సమయం పొందారు. వాహనచోదకులు తమ పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌ల్లో చెల్లించవచ్చని డీసీపీ చౌహాన్ తెలిపారు. -
మరింత జవాబుదారీతనంతో ‘ఈ-చలాన్’
హైదరాబాద్ : - శరత్ తన వాహనాన్ని రాంగ్రూట్లో నడపలేదు. అయినప్పటికీ ఇంటికి చలాన్ వచ్చింది. - భరత్ తన వాహనాన్ని నో పార్కింగ్ జోన్లో నిలపలేదు. అయినా జరిమానా విధించారు. - ఆ ఉల్లంఘనకు పాల్పడింది వేరే వాహనం... పొరపాటున అతడికి ఈ-చలాన్ పంపారు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులకు వాహనచోదకుల నుంచి తరచుగా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ నేపథ్యంలో అవి నిజాలనీ స్పష్టమవుతున్నాయి. అలాంటప్పుడు విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అధికారుల్ని గుర్తించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ-చలాన్ల జారీలో సమగ్ర విధానం లేకపోవడంతో అది సాధ్యం కావట్లేదు. దీంతో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ల జారీలో పాదర్శకత పెంచడం, సిబ్బందిని జవాబుదారీ చేయడం, సాక్ష్యాధారాల సేకరణకు ప్రత్యేక విధానం రూపొందించారు. ఈ-చలాన్లు పంపే ఉల్లంఘనల గుర్తింపు నుంచి అప్రూవ్ వరకు పారదర్శకంగా ఉండేలా సాఫ్ట్వేర్ అమల్లోకి రానుంది. దీని ప్రకారం క్షేత్రస్థాయిలో ఉల్లంఘనల ఫొటోలు తీసిన సిబ్బంది...గరిష్టంగా 20 సెకన్ల నిడివితో ఉండే వీడియోనూ చిత్రీకరించాలి. వాటిని అప్లోడ్ చేసే సమయంలో వారి పేరు, నంబర్, హోదా తదితరాలను పొందుపరచాలి. వీటిని అప్రూవ్ చేస్తున్న, అప్లోడ్ చేస్తున్న వారూ ఈ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. వీటి ఆధారంగా ఉల్లంఘనలకు పాల్పడనివారికి ఈ-చలాన్లు జారీ అయితే అందుకు బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ నెలలోనే నూతన విధానాన్ని ప్రారంభించనున్నామని ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ వెల్లడించారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు ఈ-చలానా
హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్నవారిపై కొరడా ఝళిపిస్తున్న పోలీసులు.. రూల్స్ అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనే చందంగా వ్యవహరిస్తున్నారు. శిరస్త్రాణం లేకుండా వాహనం నడిపిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు ఈ-చలాన్లు పంపి తమ వృత్తి ధర్మం నిర్వర్తించారు. నగరంలోని పారిశుద్ధ్య పనులు పరిశీలించడానికి అర్ధరాత్రి వేళ హెల్మెట్ లేకుండా బైక్‌పై పర్యటించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు గురువారం ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్లు పంపారు. అయితే గ్రేటర్ ప్రథమ పౌరుడు ఆకస్మిక తనిఖీల పేరిట హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతే నెటిజన్లు తమ ప్రతాపం చూపించారు. సామాన్యుడికి ఓ రూల్, మేయర్‌కు మరో రూలా అంటూ విమర్శలు గుప్పించటంతో... ఎట్టకేలకు పోలీసులు...మేయర్ ఇంటికి ఈ-చలానా పంపించినట్లు సమాచారం. -
పోలీసులు లేకపోయినా.. జరిమానా తప్పదు!
ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. పోలీసులు చూసినప్పుడు మాత్రమే పట్టుకుని ఫైన్ వేస్తారని ఇన్నాళ్లూ అనుకున్నా, ఇప్పుడు మరో కొత్త విధానం కూడా అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర మనం ఆగినప్పుడు.. ద్విచక్ర వాహనం మీద వెళ్తూ.. తలమీద హెల్మెట్ లేకపోతే సిగ్నళ్ల దగ్గరే ఉండే సీసీటీవీ కెమెరాలు మనల్ని ఫొటో తీస్తాయి. వాటి ద్వారా హెల్మెట్ ఈ-చలానా పంపాలని పోలీసులు నిర్ణయించారు. అది కూడా వందో, రెండు వందలో కాదు.. ఏకంగా రూ. 1500 వరకు ఫైన్ వేయాలని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి, బండి మీద బయటకు వెళ్తుంటే మాత్రం హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోవద్దు!! -
గీత దాటితే.. మోతే!
సాక్షి, కర్నూలు: వాహన చోదకులూ.. జర జాగ్రత్త. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేశారో ఇక అంతే సంగతులు. నిఘా కళ్లు మీమ్మల్ని వెంటాడబోతున్నాయి. కెమెరా కన్ను ప్రతిపక్షణం పహారా కాయబోతోంది. అసాంఘిక శక్తుల ఆటకట్టించడమే కాదు.. అక్రమాక్కుల ఆగడాలను కట్టడి చేయడమే ధ్యేయంగా కర్నూలు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే.. వాహనదారుని చిరునామాకే ఈ-చలాన్(జరిమానా) పంపేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సో.. బీ కేర్ ఫుల్. ఈ-నిఘా ఎలాగంటే! కర్నూలు నగర పరిధిలో పోలీసులు ప్రారంభించిన ఈ-నిఘా వ్యవస్థ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ అనుబంధ సమస్యలను పరిష్కరించేందుకు 30 ప్రాంతాల్లో 120 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇకపై నిబంధనలు ఉల్లఘించిన వారిపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. సిగ్నల్స్ చూడకుండా రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు ముకుతాడు వేయనున్నారు. నిర్విరామంగా పనిచేసే ఈ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఉల్లంఘనులను గుర్తించనున్నారు. ఇంటికే ఈ-చలాన్ ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు రహదారులపై నిలబడి అనుమానం వచ్చిన వాహనాలను ఆపి రికార్డులను పరిశీలించి.. ఏవైనా పత్రాలు సరిగా లేకపోతే ఆ మేరకు జరిమానా విధించి డబ్బులు వసూలు చేసేవారు. అయితే కొందరు అధికారులకు ఈ విధులు వరంగా మారాయి. వాహనదారులకు రసీదులు ఇవ్వకుండా వారి నుంచి వసూలు చేసిన మొత్తాలను తమ జేబుల్లో నింపుకుంటున్నట్లు ఆరోపణలు అనేకం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల కళ్లు గప్పి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను.. కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ద్వారా గుర్తించి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా వారి చిరునామాలకే ఈ-చలాన్లు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అధికారులను ఇకపై కేవలం చలాన్ రాయడానికే పరిమితం చేసి.. జరిమానాను ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలకం కానున్న ఈ-నిఘా వ్యవస్థ ఈ-నిఘాను సమర్థంగా అమలు చేసి కెమెరాల వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా పరిధిలో 6 పోలీసు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ జరుగుతోంది. దీంతో పాటు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని కర్నూలులో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. లక్ష్యాలు ఎక్కువగా ఉండడం.. ఉన్న సిబ్బందితోనే అన్ని పనులు చేయాల్సి రావడంతో పోలీసు శాఖపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది నేరాల దర్యాప్తు, నియంత్రణపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న దృష్ట్యా కర్నూలు పోలీసు ఉన్నత వర్గాలు ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. నేరాల్లో ఆధారాల సేకరణకు ఎక్కువ సమయం తీసుకుంటుండడం, ఇదే అదునుగా నేరాగాళ్లు తప్పించుకుంటున్నారన్న అపవాదు ఉండడంతో సులభంగా ఆధారాలను సేరకించేందుకు అవసరమైన మార్గాలను ఆన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే తొలిసారి జిల్లావ్యాప్తంగా ఈ-నిఘా వ్యవస్థను సంపూర్ణంగా అమలు చేసే దిశగా కసరత్తు ముమ్మరమైంది. -
పోస్టాఫీసుల్లోనూ...
* ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లించే సదుపాయం * నేటి నుంచి అందుబాటులోకి... సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి.. ఈ-చలాన్ బారిన పడిన వాహనదారులు ఇక నుంచి పోస్టాఫీసుల్లోను డబ్బులు చెల్లించవచ్చు. ఈ మేరకు పోస్టల్, ట్రాఫిక్ శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలోని 250 పోస్టాఫీసుల్లో పెండింగ్ చలాన్ రుసుం చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ కల్పించారు. సోమవారం నుంచి ఈ సదుపాయం అందు బాటులోకి తెస్తున్నారు. నగరంలో సుమారు 40 లక్షల పెండింగ్ చలానాలున్నాయి. వీరి నుంచి సుమారు రూ.80 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఇటీవలే నగదు రహిత చలాన్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు నగదు చెల్లించనవసరం లేదు. తమకు నగదు చెల్లించమని ట్రా ఫిక్ సిబ్బంది లేదా ఏ అధికారైనా అడిగితే 9010203626 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. చలాన్లను సెల్ఫోన్ల ద్వారా చెల్లించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా యాప్‌ను సైతం రూపొందించారు. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ-చలాన్ తెలంగాణ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీ వాహనంపై ఏమైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా ? అనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే వారు ఠీఠీఠీ.జ్టిఞ.జౌఠి.జీ వెబ్సైట్ తెరచి, అందులో ఈ-చలాన్ స్టాటస్పై క్లిక్ చేయాలి. చలాన్ ఇలా కూడా చెల్లించవచ్చు... * డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎస్బీహెచ్, ఐసీఐసీఐ,ఆంధ్రబ్యాంక్ ద్వారా. * ఈ-సేవా, మీ-సేవా సెంటర్లు * ఏపీ ఆల్‌లైన్ సెంటర్లు * పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ * కంపౌండింగ్ బూత్ నెట్ బ్యాంకింగ్ ... -
‘జరిమానా’ సొమ్ములో సగం మాకివ్వండి..
ప్రభుత్వానికి ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి సాక్షి, ముంబై : తమ విభాగం గత ఏడాది వాహనదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో సగం డబ్బును తమకు ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ విభాగం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. గత ఏడాది ముంబై ట్రాఫిక్ విభాగం దాదాపు రూ. 20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. ఇందులో సగం డబ్బు తమకు ఇస్తే బ్రీత్ అనలైజర్లు, స్పీడ్గన్లు, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (సీసీటీవీ) తదితర మెరుగైన సౌకర్యాలను సమకూర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిని పరీక్షించేందుకు సరిపడినంత పరికరాలు కొరవడ్డాయన్నారు. గత ఏడాది ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16 బ్రీత్ అనలైజర్లను అందుకుంది. అవేకాకుండా మొత్తంగా 90 బ్రీత్ అనలైజర్లు ఉన్నాయనీ, అయితే ఇవి సరిపడినంతగా లేవని అధికారి తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ‘జరిమానా’ సొమ్ములో సగం తమ విభాగానికి బదలాయించేందుకు అంగీకరిస్తే, తాము నిబంధనలను మరింత కఠినంగా అమలుచేసి ఆదాయం పెంపునకు కృషిచేసేందుకు వీలుపడుతుందని ట్రాఫిక్ విభాగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డాక్టర్.బి.కె.ఉపాధ్యాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనకు అనుమతి లభిస్తే ట్రాఫిక్ విభాగానికి ఎంతో లాభపడుతోందన్నారు. ఇతర నిధులను ఆశించకుండా ఉండేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు తమకు అత్యవసరంగా చాలా పరికరాలు అవసరం ఉంటాయని ఆయన వివరించారు. ఈ-చలాన్‌తో ‘ట్రాఫిక్’కు పనిభారం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-చలాన్ వ్యవస్థ ట్రాఫిక్ విభాగానికి మరింత పని భారాన్ని తెచ్చిపెట్టింది. నవీముంబై ట్రాఫిక్ విభాగం రాష్ట్రంలోనే మొదటిసారిగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ఈ-చలాన్ వ్యవస్థను గత ఏడాది ప్రారంభించింది. అయితే ట్రాఫిక్ విభాగం సమయం ఆదా చేసేందుకు ఈ-చలాన్ వ్యవస్థను ప్రారంభించినప్పుటీ తమకు పని భారం ఎక్కువవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో 15 ట్రాఫిక్ యూనిట్లు ఉన్నాయి. వీటికి ఈ-చలాన్ పరికరాన్ని అందజేశారు. 30 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చారు. కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి పూర్తి సమచారాన్ని ఘటనా స్థలంలోనే ఫీడ్ చేసి ప్రింట్ అవుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఒకోసారి కొత్త ఈ-చలాన్ వ్యవస్థ పనిచేయకుంటే తిరిగి వీరి వివరాలను మాన్యువల్‌గానే చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో వాహనదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండడంతో ఇది కొంత మేర సులభంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఈ పరికరాలు పని చేయకుంటే పాత వ్యవస్థనే ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో దీనిని తీసివేయవద్దని ట్రాఫిక్ విభాగం కోరుతోంది. అయితే ఒక వేళ ట్రాఫిక్ పోలీసులు ఒకేసారి 20 మంది వాహన దారులను పట్టుకున్నట్లుయితే వీరి వివరాలను వేర్వేరు రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. దీంతో తమకు మరింత పని భారం పెరుగుతోందని ట్రాఫిక్ అధికారి తెలిపారు.