
సాక్షి, మంచిర్యాల : చట్టానికి ఎవరు అతీతులు కాదు.. నిబంధనలు అందరికీ సమానమే అని స్పీడ్ లేజర్ గన్ (కెమెరా) ద్వారా స్పష్టమైంది. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌కు చెందిన టీఎస్19సీ1009 నంబర్ గల వాహనానికి ఈ నెల 28న సైబర్‌బాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట వద్ద స్పీడ్ లేజర్ గన్‌తో జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్‌శాఖ వాహనాల అతివేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ లేజర్ గన్‌ను అందుబాటులోకి తెచ్చారు. రహదారులపై నిర్ధేశించిన వేగానికంటే అధికవేగంతో వెళ్తే స్పీడ్ లేజర్ గన్ పసిగడుతుంది. దీంతో ఈ–చలాన్ ద్వారా జరిమానా విధించడం జరుగుతోంది. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ వాహనం అతివేగంగా వెళ్లడంతో స్పీడ్ లేజర్ గన్ ద్వారా రూ.1035 జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment