పోస్టాఫీసుల్లోనూ...
* ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లించే సదుపాయం
* నేటి నుంచి అందుబాటులోకి...
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి.. ఈ-చలాన్ బారిన పడిన వాహనదారులు ఇక నుంచి పోస్టాఫీసుల్లోను డబ్బులు చెల్లించవచ్చు. ఈ మేరకు పోస్టల్, ట్రాఫిక్ శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలోని 250 పోస్టాఫీసుల్లో పెండింగ్ చలాన్ రుసుం చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ కల్పించారు. సోమవారం నుంచి ఈ సదుపాయం అందు బాటులోకి తెస్తున్నారు. నగరంలో సుమారు 40 లక్షల పెండింగ్ చలానాలున్నాయి.
వీరి నుంచి సుమారు రూ.80 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఇటీవలే నగదు రహిత చలాన్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు నగదు చెల్లించనవసరం లేదు. తమకు నగదు చెల్లించమని ట్రా ఫిక్ సిబ్బంది లేదా ఏ అధికారైనా అడిగితే 9010203626 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. చలాన్‌లను సెల్‌ఫోన్‌ల ద్వారా చెల్లించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా యాప్‌ను సైతం రూపొందించారు.
ఈ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ-చలాన్ తెలంగాణ అని క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీ వాహనంపై ఏమైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లు ఉన్నాయా ? అనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే వారు ఠీఠీఠీ.జ్టిఞ.జౌఠి.జీ వెబ్‌సైట్ తెరచి, అందులో ఈ-చలాన్ స్టాటస్‌పై క్లిక్ చేయాలి.
చలాన్ ఇలా కూడా చెల్లించవచ్చు...
* డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎస్‌బీహెచ్, ఐసీఐసీఐ,ఆంధ్రబ్యాంక్ ద్వారా.
* ఈ-సేవా, మీ-సేవా సెంటర్లు
* ఏపీ ఆల్‌లైన్ సెంటర్లు
* పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్
* కంపౌండింగ్ బూత్ నెట్ బ్యాంకింగ్
...