‘ఈ-చలాన్ల’ చెల్లింపు గడువు పెంపు
ఈ నెల 24 వరకు అవకాశం: ట్రాఫిక్ డీసీపీ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.వెరుు్య నోట్లను వినియోగించి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లు చెల్లించుకునే అవకాశాన్ని 10 రోజుల పాటు పొడిగిం చినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్‌ఎస్ చౌహాన్ మంగళవారం వెల్లడించారు. తొలుత ఆదివారం నుంచి 48 గంటల ఇచ్చిన అవకాశం సోమవారం సాయంత్రంతో ముసిగింది. రెండు రోజుల కాలంలో 7,013 మంది వాహనచోదకులు రూ.13.53 లక్షలు చెల్లించారు. ట్రాఫిక్ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ.40 కోట్ల మేర ట్రాఫిక్ ఈ-చలాన్ల బకారుులు ఉన్నారుు. పాత కరెన్సీతో చెల్లింపు గడువు పెంచితే మరింత మందికి ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ నెల 24 వరకు సమయం పొందారు. వాహనచోదకులు తమ పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌ల్లో చెల్లించవచ్చని డీసీపీ చౌహాన్ తెలిపారు.