బూర్గంపాడు(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.
దీంతో బైక్ పై ఉన్న రాయల దుర్గ(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కలవారు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు విజయనగర్ కాలనీ వాసిగా గుర్తించారు.