ప్రమాదానికి కారణమైన లారీ, దెబ్బతిన్న ఆటో
సాక్షి, కోదాడ : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్జల్‌పాషా(48), గౌసియాబేగం(40), మహబూబ్‌పాషా(40) మహిముదాబేగం(35), మాహిన్(15), ముస్కాన్(12), జాకిర్ పాషా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో షేక్ అబ్జల్ పాషా ఇంటి పెద్ద. తన చెల్లెలు అక్తర్‌బేగం మనవరాలు బారసాల ఫంక్షన్‌కు బుధవారం కో దాడ వచ్చారు. శుభకార్యం పూర్తికాగానే హుజూర్‌నగర్‌లో నివాసముంటున్న అబ్జల్‌పాషా చిన్న తమ్ముడు యాకుబ్ పాషా ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం జాన్‌పహాడ్ దర్గాకు వెళ్లి అదే రోజు రాత్రి 7గంట లకు హుజూర్‌నగర్‌కు చేరుకున్నారు. అయితే రాత్రి అక్కడే నిద్రపోయి తెల్లవారుజామున 6 గం టలకు లేచి తమ స్వగ్రామానికి బయలుదేరారు.
ఓవర్‌టేక్ చేసే క్రమంలో..
కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామునే లేచి స్వగ్రామానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో హుజూర్‌నగర్‌లోనే కోదాడకు వెళ్లే ఆటోను మాట్లాడుకుని అందులో ఎక్కారు. చిలుకూరు మండలం చిలుకూరు మండలం సీతా రంపురం వద్దకు చేరుకోగానే ఆటో డ్రైవర్ ముం దున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. రెప్ప పాటులో చోటు చేసుకున్న ఈ ఘోర దుర్‌ఝటనలో షేక్ అబ్జల్‌పాషా, గౌసియాబేగం, మహిముదా బేగం, మాహిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్‌పాషా, ము స్కాన్, జాకిర్ పాషా, ఆటో డ్రైవర్ నాగుల్ మీరా కు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు రోడ్డు పై చెల్లా చెదురుగా పడిపోయాయి. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను తొలుత హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లాకు తరలించారు. మార్గమధ్యలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్దకు చేరుకోగానే పరిస్థితి విషమించి ముస్కాన్ మృతి చెందింది. మహబూబ్‌పాషా కూడా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రిలో చికిత్స పొందు తూ మృత్యుఒడికి చేరుకోగా డ్రైవర్ నాగుల్ మీరా, జాకిర్ పాషా చికిత్స పొందుతున్నారు.
రెండు కుటుంబాల్లో మిగిలింది ఒక్కరే..
ప్రమాదంలో దుర్మరణం పాలైన షేక్ అబ్జల్‌పాషా ఇంటి పెద్ద. ఈయన తోడ మొత్తం ఏడుగురు. ముగ్గురు చొప్పున తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారు. అబ్జల్ పాషా, మహమూద్ పాషా కుటుంబాలు స్వగ్రామంలోనే ఉంటుండగా, చిన్న తమ్ముడు యాకుబ్ పాషా హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని ఆరుగురు మృతిచెందగా జాకిర్‌పాషా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన విషయం తెలుసుకున్న బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆరుగురు బలైపోవడంతో బోరున విలపించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
కాగా విషయం తెలుసుకున్న సూర్యాపేట ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, కోదాడ రూరల్, టౌన్ సీఐలు రవి. శ్రీనివాస్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చిలుకూరు ఎస్‌ఐ వెంకన్నను వివరాలు అడిగి తెలుసుకుని తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment