హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న దోబీ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న దోబీ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఓ మహిళ అతి వేగంతో కారు నడపడంతో సైదాబాద్ దోబీ ఘాట్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.