అతివేగానికి పదుల సంఖ్యలో ప్రాణాలు బలి | over speed kills one person, 40 sheeps in darshi | Sakshi
Sakshi News home page

అతివేగానికి పదుల సంఖ్యలో ప్రాణాలు బలి

Published Sat, Apr 25 2015 7:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో దారిన వెళుతున్న ఓ వ్యక్తితో పాటు 40 గొర్రెలు మృతి చెందాయి.

దర్శి : అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో దారిన వెళుతున్న ఓ వ్యక్తితో పాటు 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కారు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా... ఎదురుగా ఓ లారీ రావడంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దాంతో కారు చిన్న వెంకయ్య(50) అనే వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు ఎగిరి రోడ్డు అవతలి వైపు పడిపోయాడు. అనంతరం కారు రోడ్డుపై వెళుతున్న ఓ గొర్రెల మందను ఢీకొంది. సుమారు 1,000 గొర్రెలు వెళుతుండగా కారు వేగంగా ఢీకొట్టడంతో 40 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. మరి కొన్నింటికి నడుం, కాళ్లు విరిగిపోయాయి. దీంతో ప్రమాద స్థలి భీతావహంగా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబుల్ రోడ్డు కావడంతో మరో వైపు వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement