హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇంకేముంది.. పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్‌లకు పని చెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేశారు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1 నుంచి లాంబోర్గిని కారు (టీఎస్09 జీడీ 9777)లో ఓ యువకుడు మితిమీరిన వేగంతో, భారీ శబ్దంతో దూసుకెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు.
ఈ కారును ఓ యువకుడు ఫొటోలు తీశాడు. ‘కారు మాత్రమే నీది.. రోడ్డు కాదు’ అంటూ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. సోమవారం రోజంతా సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు కారు నడిపిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. లాంబోర్గిని కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించడంతో పోలీసులు వేట ప్రారంభించారు. ట్వీట్ చూసిన సదరు కారు నడిపిన యువకుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment