
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ప్యాట్నీ సిగ్నల్ వద్ద ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు ఆటో తిరగబడి పడిపోవడంతో అందులో ఉన్నవారు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. వెంటనే వారిని స్థానికులు పలు ఆస్పత్రులకు తరలించారు. అంతా జరిగిన కారు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అతి వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment