బ్యాంకు ఖాతాలో బాగా డబ్బులుండటమే ఆ పెద్దమనిషి చేసుకున్న పాపం. అతి వేగంతో కారు నడిపినందుకు ఆ స్వీడిష్ కోటీశ్వరుడికి ఫిన్లాండ్లోని ఓ కోర్టు ఏకంగా 80 లక్షల రూపాయల జరిమానా విధించింది.
బ్యాంకు ఖాతాలో బాగా డబ్బులుండటమే ఆ పెద్దమనిషి చేసుకున్న పాపం. అతి వేగంతో కారు నడిపినందుకు ఆ స్వీడిష్ కోటీశ్వరుడికి ఫిన్లాండ్లోని ఓ కోర్టు ఏకంగా 80 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆయన బాగా డబ్బున్నవాడు కావడమే అందుకు కారణమట. ఆండర్స్ విక్లాఫ్ (67) అనే వ్యాపారవేత్త ఫిన్లాండ్లోని అలాండ్ దీవుల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా, 77 కిలోమీటర్ల వేగంతో వెళ్లాడు. దీంతో ఆయనకు 80 లక్షల రూపాయల జరిమానా విధించారు. అదే తన సొంత దేశం స్వీడన్లో అయితే ఆయనకు కేవలం ౩8 వేల రూపాయల జరిమానా మాత్రమే పడేది.
ఫిన్లాండ్లో ఎవరికైనా ఎంత ఆస్తి ఉందన్నదాన్ని బట్టి వారికి జరిమానా విధిస్తారు. ఆండర్స్ విక్లాఫ్ వద్ద చాలా డబ్బు ఉంది. దాంతో ఆయనకు భారీ జరిమానా పడింది. తాను వేగంగా నడిపి చట్టాన్ని ఉల్లంఘించిన మాట నిజమే అయినా, జరిమానా మాత్రం మరీ ఎక్కువ వేశారని ఆ పెద్దమనిషి వాపోయాడు. దీనికి బదులు వృద్ధుల కోసం తాను ఈ డబ్బు ఖర్చుపెట్టి ఉండేవాడినని అన్నాడు.