కారు హల్‌చల్: ఒకరికి గాయాలు
కారు హల్‌చల్: ఒకరికి గాయాలు
Published Wed, Aug 3 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నార్తురాజుపాలెం(కొడవలూరు): నార్తురాజుపాలెంలో కారు హల్‌చల్ చేసిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వారు కొత్తకారు కొనుగోలు చేసి ఆ కారులో రామతీర్థానికి పూజకు వెళ్లారు. అక్కడ పూజ పూర్తి చేసుకొని తిరిగి అతివేగంగా వస్తూ బసవాయపాలెం వద్ద నెల్లూరు నుంచి విధులు ముగించుకొని స్వగ్రామమైన అల్లూరుకు మోటార్ సైకిల్‌పై వెళుతున్న కుండా గౌతమ్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గౌతమ్‌కు గాయాలయ్యాయి. ఆ వెంటనే అప్రమత్తమైన గౌతమ్lకారును వెనుకనే వెంబడించగా, మరింత వేగంతో నార్తురాజుపాలెం వైపు వచ్చిన ఆ కారు స్థానిక బస్టాండు కూడలిలో అతివేగంగా అటుఇటు తిప్పుతూ స్థానికులను భయభ్రాంతులను చేసి నెల్లూరు వైపు దూసుకెళ్లింది. కారును అతివేగంగా మలుపులు తిప్పడంతో కూడలిలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నార్తురాజుపాలెంలో హల్‌చల్ చేసి పరారైన కారు నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద వదిలేసి ఉండగా, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హల్‌చల్ చేసిన కారును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement