ఆస్ట్రేలియా జెల్లీఫిష్‌కు బాలుడి పేరు! | New jellyfish named after Queensland schoolboy | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా జెల్లీఫిష్‌కు బాలుడి పేరు!

Published Fri, Jul 17 2015 1:56 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

ఆస్ట్రేలియా జెల్లీఫిష్‌కు బాలుడి పేరు!

ఆస్ట్రేలియా జెల్లీఫిష్‌కు బాలుడి పేరు!

సిడ్నీ: ఆస్ట్రేలియాలో వెలుగుచూసిన కొత్త జాతి జెల్లీషిఫ్‌కు శాస్త్రవేత్తలు ఓ బాలుడిపేరు పెట్టారు. వివరాలు.. 2013లో సాక్సన్ థామస్ (9) ఏళ్ల బాలుడు క్వీన్స్‌లాండ్ కాలువ వద్ద తన తండ్రితో కలిసి చేపలు పడుతున్నాడు. ఆ సమయంలో డబ్బా ఆకారంలో ఉన్న జెల్లీఫిష్ ఒకటి తీరానికి కొట్టుకువచ్చింది. దాని పొడవైన ‘టెంటికిల్స్’ను చూసి ఇదేదో కొత్త జీవి కావచ్చన్న అనుమానంతో వలసాయంతో తీశాడు.

చొరవతీసుకుని దాన్ని క్వీన్స్‌లాండ్ మ్యూజియంకు పంపాడు. అక్కడ ఆ జెల్లీఫిష్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది నిజంగా కొత్త జాతేనని నిర్ధారించారు. తనకు దొరికిన జెల్లీఫిష్‌ను క్వీన్స్‌లాండ్ మ్యూజియానికి పంపాలన్న తొమ్మిదేళ్ల సాక్సన్ సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే పిల్లాడికి గౌరవార్థంగా సాక్సన్ థామస్ పేరు కలిసేలా ‘క్రిప్సెల్లా సాక్సానీ’ అని నామకరణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement