నార్త్ మకాయ్ : తాగినమత్తులో సోదరికి చెందిన కుక్కపై విచక్షణా రహితంగా దాడి చేసాడో వ్యక్తి . అనవసరంగా దానిపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్‌లాండ్‌లోని నార్త్ మాకాయ్‌కి చెందిన ఆండ్రూ కోలోమెన్ అనే వ్యక్తి తన సోదరికి చెందిన జాబు అనే కుక్కను ప్రేమగా దగ్గరకు పిలిచి, అది దగ్గరకు రాగనే దానిపై దాడి చేశాడు. పిడికిలితో, మోచేతితో దానిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. దానిపై పడి చితకబాదాడు. ఎలాగోలా అతడి దాడినుంచి తప్పించుకున్న జాబు అక్కడినుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డై వైరల్ అవ్వటంతో జంతు ప్రేమికులు‘‘ నీకు జాలనేదే లేదా! నువ్వసలు మనిషివేనా’’ అంటూ అతడిపై విరుచుకుపడ్డారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
తాగినమత్తులో కుక్కపై విచక్షణా రహితంగా దాడి
ఆండ్రూను కఠినంగా శిక్షించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన తుది తీర్పును కోర్టు వెలువరించింది. అతడి నేరం నిరూపణ అవ్వటంతో మకాయ్ మెజిస్ట్రేట్ కోర్టు తగిన విధంగా శిక్షించింది. అంతేకాకుండా 3 సంవత్సరాల పాటు కుక్కలను పెంచుకోవటానికి వీలులేదని తేల్చిచెప్పింది. కాగా కుక్క చనిపోలేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ అతడికి జైలు శిక్ష పడకుండా అడ్డుకున్నారు అతడి తరపు న్యాయవాదులు.
Comments
Please login to add a commentAdd a comment