మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతంలోని క్వీన్లాండ్స్లో గురువారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదయింది. ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించ లేదని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వెల్లడించింది. అయితే తూర్పు తీరంలో సునామీ వచ్చే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయని జియో సైన్స్ ఆస్ట్రేలియా తెలిపింది. భూకంప కేంద్రాన్ని కూడా కనుగొన్నట్లు పేర్కొంది.