పైశాచికత్వం! తాబేలుపై తైతక్కలాడారు!
పైశాచికత్వం! తాబేలుపై తైతక్కలాడారు!
Published Wed, Nov 2 2016 5:20 PM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM
ఇద్దరు వ్యక్తులు తమ పైశాచిక ఆనందం కోసం సముద్ర తాబేలుపై తైతక్కలాడారు. అంతేకాకుండా తాము చేసిన ఘనకార్యన్ని ఫేస్‌బుక్‌లో ఫొటో తీసి పెట్టారు. వీరి చర్యపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌కు చెందిన రికీ రోజర్స్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో పెట్టి.. వారాంతం సందర్భంగా తాబేలుపైకి ఎక్కి తామిద్దరం సర్ఫింగ్ చేసినట్టు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో జీవవైవిధ్యం అధికంగా ఉండే క్వీన్స్‌లాండ్‌లో అతను ఈ ఫొటోను తీసినట్టు.. ట్యాగ్‌ను బట్టి తెలుస్తోంది.
అతని పోస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బుర్రలేని ఈ మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూర్ఖలపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దసంఖ్యలో ఈ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫొటోపై అంతర్జాతీయ జంతు హక్కుల సంస్థ ఆర్‌ఎస్పీసీఏ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు ఇడియట్ల చర్య వల్ల ఆ తాబేలు చనిపోయి ఉంటుందని క్వీన్స్‌లాండ్ పార్క్స్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ తెలిపింది. అయితే, ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన ఆ ఇద్దరిపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. వారిపై భారీ జరిమానా విధించేలా దర్యాప్తును ముందుకు సాగిస్తామని క్వీన్స్‌లాండ్ అధికారులు స్పష్టం చేశారు.
Advertisement