కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో క్విన్స్‌లాండ్, టౌన్స్‌విల్లే నగరాలు జలదిగ్బంధమయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వరద నీటిలో చిక్కుకుని రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోరెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
టౌన్స్‌విల్లే నగరంలో శనివారం 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment