91 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి
మవెలిక్కర: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేరళలో అలప్పుజ జిల్లా ఒరివిక్కాడ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 91 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు(24) ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం ఆమె కూతురు ఇంటికి రాగా ఒంటినిండా గాయాలతో తన తల్లి కింద పడిపోయి కనిపించింది.
విషయం గ్రహించిన ఆమె..వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధురాలి ఇంటికి సమీపంలోనే ఉండే యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.