కోల్‌కతా : పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధురాలు అదృష్టం తలుపుతట్టడంతో రాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం చక్పుల్ధుబి గ్రామంలో పుష్పాకర్ అనే వృద్ధురాలికి నదిలో భారీ చేప పట్టుబడటంతో దాన్ని ఆమె రూ 3 లక్షలకు విక్రయించారు. ఆమెకు 52 కిలోల చేప చిక్కడంతో స్ధానిక మార్కెట్‌లో దానికి కిలో 6200 రూపాయలు పలికింది. తనకు దక్కిన చేప తనకు జాక్‌పాట్‌లా మారిందని, ఈ చేపను హోల్‌సేల్ మార్కెట్‌లో రూ 3 లక్షలకు పైగా విక్రయించానని పుష్ప వెల్లడించారు. ఇంత పెద్ద చేపను తన జీవితంలో తాను ఎన్నడూ చూడలేదని, బెంగాలీలో ఈ చేపను భోలా ఫిష్‌గా పిలుస్తారని మహిళ పేర్కొన్నారు.
నది నుంచి ఈ భారీ చేపను బయటకు తీసుకువచ్చి గ్రామంలోకి తీసుకురావడానికి వృద్ధురాలు చాలా కష్టపడ్డారని స్దానికులు తెలిపారు. వారి సాయంతోనే ఆమె భారీ చేపను ఫిష్ మార్కెట్‌కు తీసుకువెళ్లారు. నౌకను ఢీ కొనడంతో ఈ చేప మరణించిందని గ్రామస్తులు చెప్పారు. చేప డీకంపోజ్ కావడం మొదలవకుండా ఉంటే మరింత ధర పలికేదని స్ధానిక వ్యాపారులు తెలిపారు. బ్లబ్బర్‌గా పిలిచే ఈ చేప కొవ్వును అధిక ధరలకు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని వారు వెల్లడించారు. చదవండి : మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా చేప..
Comments
Please login to add a commentAdd a comment