వివరాలను తెలియజేస్తున్న డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి
సాక్షి, రాజంపేట: పట్టణంలోని ఎర్రబల్లి(ఆరీ్టసీ సర్కిల్)లో నర్రెడ్డి సుమిత్రమ్మ(55) హత్య మిస్టరీకి ఏడాది తర్వాత బ్రేక్ పడింది. గురువారం అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వివరాలను వెల్లడించారు. గతేడాది మార్చి 3న సుమిత్రమ్మ వియ్యంకురాలు వెలిచెలమల ఇందిరమ్మ, మరో ఇద్దరు కలిసి హత్యచేశారన్నారు. సుమిత్రమ్మ కోడలు నరెడ్డ్రి శ్వేతను హింసిస్తున్నట్లు తల్లి ఇందిరమ్మకు తెలిపిందన్నారు. దీంతో ఇందిరమ్మ ఓర్సునాగరాజుకు తన కుమార్తెను అత్త (సుమిత్రమ్మ)వేధిస్తోందని, సుమిత్రమ్మను హతమార్చాలని కోరిందన్నారు. (వృద్ధురాలి హత్య)
నాగరాజు, మల్లికార్జున, రమేష్‌లు కలిసి వెళ్లి గొంతు నులిమి ముఖంపై దిండు పెట్టి, ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించుకొని వెళ్లిపోయారన్నారు. కాగా మల్లికార్జున 15రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడన్నారు. మిగిలిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 62 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. హత్యకు పాల్పడిన వారంతా అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పశ్చిమ నడింపల్లె, దేవరపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment