mystory case
-
సోనాల్ ఫోగట్ మృతిలో మరో ట్విస్ట్.. నైట్ క్లబ్ వీడియో వైరల్
ఛండీగఢ్: బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు. ఇదిలా ఉండగా.. సోనాల్ ఫోగట్ మృతిపై ఆమె సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు. సోనాల్ ఫోగట్ పీఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని అన్నాడు. ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా, రింకు ఆరోపణ నేపథ్యంలో సోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్ తన పీఏ సుధీర్ సంగ్వాన్, ఫ్రెండ్ సుఖ్విందర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. వారందరూ ఎంతో క్లోజ్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, పోస్టుమార్టమ్ రిపోర్ట్ ప్రకారం సోనాలి శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు. This video is being told a month ago of a farm house in Gurugram, #SonaliPhogat dancing with Sudhir Sangwan and Sukhwinder Sangwan. pic.twitter.com/8fTtfzw88y — Nikhil Choudhary (@NikhilCh_) August 24, 2022 ఇది కూడా చదవండి: ఊహించని విషాదం.. మరణం ముందర సరదాగా సోనాలి.. అభిమానుల భావోద్వేగం -
వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ
సాక్షి, రాజంపేట: పట్టణంలోని ఎర్రబల్లి(ఆరీ్టసీ సర్కిల్)లో నర్రెడ్డి సుమిత్రమ్మ(55) హత్య మిస్టరీకి ఏడాది తర్వాత బ్రేక్ పడింది. గురువారం అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వివరాలను వెల్లడించారు. గతేడాది మార్చి 3న సుమిత్రమ్మ వియ్యంకురాలు వెలిచెలమల ఇందిరమ్మ, మరో ఇద్దరు కలిసి హత్యచేశారన్నారు. సుమిత్రమ్మ కోడలు నరెడ్డ్రి శ్వేతను హింసిస్తున్నట్లు తల్లి ఇందిరమ్మకు తెలిపిందన్నారు. దీంతో ఇందిరమ్మ ఓర్సునాగరాజుకు తన కుమార్తెను అత్త (సుమిత్రమ్మ)వేధిస్తోందని, సుమిత్రమ్మను హతమార్చాలని కోరిందన్నారు. (వృద్ధురాలి హత్య) నాగరాజు, మల్లికార్జున, రమేష్‌లు కలిసి వెళ్లి గొంతు నులిమి ముఖంపై దిండు పెట్టి, ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించుకొని వెళ్లిపోయారన్నారు. కాగా మల్లికార్జున 15రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడన్నారు. మిగిలిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 62 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. హత్యకు పాల్పడిన వారంతా అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పశ్చిమ నడింపల్లె, దేవరపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధమే ఉసురు తీసింది
గద్వాలటౌన్(మహబూబ్‌నగర్): నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని గద్వాల టౌన్ పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఆ దారుణానికి కారణమని తేల్చారు. గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపిన వివరాలివీ.. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన రాముడు మేస్త్రీ పనిచేస్తుంటాడు. అతని భార్య సుజాతకు గద్వాలకు చెందిన తెలుగు దర్శెల్లి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో చనువుగా ఉంటున్న విషయం తెలుసుకున్న రాముడు పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో అతడిని తమకు అడ్డుగా భావించి అంతమొందించాలనుకున్నారు. తెలుగు దర్శెల్లి తనకు సన్నితులుగా ఉన్న దౌదర్పల్లికి చెందిన జాన్, స్థానిక రాంనగర్‌కు చెందిన వెంకటేష్‌తో కలసి పథకం వేశాడు. దాని ప్రకారం ఈనెల 2వ తేదీ రాత్రి చెనుగోనిపల్లి నుంచి బైక్‌పై రాముడు గద్వాలకు వస్తున్న విషయాన్ని సుజాత ద్వారా తెలుసుకుని, గ్రామ శివారులో మాటువేసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. సమీపంలోని బావిలో రాముడు మృతదేహాన్ని పడవేశారు. ఈనెల 3వ తేదీ ఉదయం సుజాత ఏడుస్తూ భర్త కన్పించడం లేదని బంధువులకు చెప్పగా వారు అనుమానం వచ్చి నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా నేరం అంగీకరించింది. హత్యకు పాల్పడిన ప్రియుడు తెలుగు దర్శెల్లితో పాటు అతనికి సహకరించిన జాన్, వెంకటేష్, సుజాతలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.