వృద్ధాప్యంలో కన్న కొడుకు, కోడలికి భారం కాకూడదని ఓ మాతృమూర్తి బలవన్మరణానికి పాల్పడింది.
వృద్ధాప్యంలో కన్న కొడుకు, కోడలికి భారం కాకూడదని ఓ మాతృమూర్తి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు... ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన బద్రిలక్ష్మీదేవి (70) సోమవారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం లక్ష్మి దేవి కనిపించక పోవడంతో.. కుటుంబ సభ్యులు ఇంటి చుట్టు పక్కల వెతకడం మొదలు పెట్టారు. ఆమె మృతదేహాన్ని బావిలో గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.