
107 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఓటేసిన బామ్మ
గ్యాంగ్‌టక్ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇక సిక్కింలో 107 సంవత్సరాల సుమిత్రా రాయ్ దక్షిణ సిక్కింలోని పాక్లోక్ కమ్రాంగ్ పోలింగ్ కేంద్రానికి వీల్ ఛైర్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం ఆమె ఉత్సాహంగా తన ఓటరు గుర్తింపు కార్డును ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. మరోవైపు 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన 126 ఏళ్ల చంద్రవదియ అజిబెన్ సిదభాయ్ అత్యధిక వయసు కలిగిన ఓటరుగా నిలిచారు.