
80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
ధర్మవరం అర్బన్ : మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ధర్మవరం పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహాత్మగాంధీ కాలనీలో 80 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె ఎప్పుడూ ఇంటి బయటే ఉంటుంది.
అటువంటి ఆమెపై సోమవారం తెల్లవారుజామున ఫకృద్దీన్ అలియాస్ ఫకృ అనే యువ ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. స్థానికులు, బంధువులు గమనించి ఆటోడ్రైవర్‌ను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.
రాత్రి ఏడు గంటల సమయంలో పోలీసులకు అప్పగించారు. ఆటోడ్రైవర్ అంటే కాలనీలో చాలామందికి గిట్టదని, ఆ క్రమంలోనే వృద్ధురాలిపై అత్యాచారం చేసినట్లు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశారని సీఐ విజయభాస్కర్‌గౌడ్ పేర్కొన్నారు