సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన బామ్మ.. వీడియో చూస్తే విజిల్‌ పడాల్సిందే.. | Old Woman Participates In Dahi Handi Event On Krishna Janmashtami | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన బామ్మ.. కృష్ణాష్టమి వేడుకల్లో వండర్‌ ఉమెన్‌

Published Sun, Aug 21 2022 3:58 PM | Last Updated on Sun, Aug 21 2022 4:01 PM

Old Woman Participates In Dahi Handi Event On Krishna Janmashtami - Sakshi

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా, ఈ వేడుకల్లో భక్తులు భారీ రేంజ్‌లో దహీ హండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టిన వారికి భారీ నజరానా సైతం ఉంటుంది. ఇక, దహీ హండీ వేడుకల్లో ఓ వృద్ధురాలు చేసిన ఫీట్‌ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఉట్టి కొట్టిన వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. 

అయితే, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌(ఐపీఎస్) అధికారి దీపాన్ష్‌ కాబ్రా ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో కొందరు మహిళలు మానవ పిరమిడ్‌లో ఏర్పాడ్డారు. ఈ క్రమంలో మహిళలపైకి ఎక్కి ఓ వృద్ధురాలు దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను(ఉట్టి)ని తన తలతో బద్దలు కొట్టింది. అనంతరం ఎంతో సేఫ్‌గా కిందకు దిగింది. 

కాగా, ఈ వీడియోపై స్పందించిన దీపాన్ష్‌ కాబ్రా.. "ది ఇన్‌క్రెడిబుల్ దాదీ" అని ‍క్యాప్షన్‌ ఇచ్చారు. ఇక, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వ్యూస్‌ పరంగా సునామీ సృష్టించింది. కొద్ది సమయంలోనే 1,87,000 కంటే ఎక్కువ వ్యూస్‌ను, దాదాపు 10,000 లైక్‌లను సాధించింది. వీడియో చూసిన నెటిజన్లు వృద్ధురాలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement