Dahi Handi Event
-
సోషల్ మీడియాను షేక్ చేసిన బామ్మ.. వీడియో చూస్తే విజిల్ పడాల్సిందే..
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా, ఈ వేడుకల్లో భక్తులు భారీ రేంజ్లో దహీ హండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టిన వారికి భారీ నజరానా సైతం ఉంటుంది. ఇక, దహీ హండీ వేడుకల్లో ఓ వృద్ధురాలు చేసిన ఫీట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఉట్టి కొట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారి దీపాన్ష్ కాబ్రా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కొందరు మహిళలు మానవ పిరమిడ్‌లో ఏర్పాడ్డారు. ఈ క్రమంలో మహిళలపైకి ఎక్కి ఓ వృద్ధురాలు దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను(ఉట్టి)ని తన తలతో బద్దలు కొట్టింది. అనంతరం ఎంతో సేఫ్‌గా కిందకు దిగింది. కాగా, ఈ వీడియోపై స్పందించిన దీపాన్ష్ కాబ్రా.. "ది ఇన్క్రెడిబుల్ దాదీ" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సునామీ సృష్టించింది. కొద్ది సమయంలోనే 1,87,000 కంటే ఎక్కువ వ్యూస్‌ను, దాదాపు 10,000 లైక్‌లను సాధించింది. వీడియో చూసిన నెటిజన్లు వృద్ధురాలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. The Incredible Dadi! pic.twitter.com/QiwPHeYYUx — Dipanshu Kabra (@ipskabra) August 20, 2022 ఇది కూడా చదవండి: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
సుప్రీం తీర్పునూ లెక్క చేయలేదు
భారీ ఎత్తులో పిరమిడ్లు నిర్మించిన మహారాష్ట్ర వాసులు ముంబై: దహీ హండీ (ఉట్టి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు పెంచడానికి అనుమతివ్వబోంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణభక్తులు పట్టించుకోలేదు. కృష్ణాష్టమి సందర్భంగా 20 అడుగులకు మించి పిరమిడ్లను నిర్మించి గురువారం ఉట్టి ఉత్సవం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా దాదర్ ప్రాంతంలో భక్తులు 20 అడుగుల మానవ పిరమిడ్ రూపంలో నేలపై పడుకుని నిరసన తెలిపారు. దహీ హండీ కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో హైకోర్టు తీర్పునే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 20 మీటర్లకు మించి ఎత్తు పెంచలేమని ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆదేశాలను ఉల్లంఘించారు. పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించుకున్నారు. ’మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ పిరమిడ్లు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను’ అని ఠాక్రే మీడియాతో అన్నారు. మహారాష్ట్రలో ఏటా జన్మాష్టమి సందర్భంగా దహీహండీ నిర్వహిస్తారు.