రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
Published Sat, Aug 27 2016 12:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
మహబూబాబాద్ : రైలు ఢీకొని గుర్తుతెలి యని వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మానుకోట రైల్వేస్టేçÙన్ సమీపంలో శుక్రవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధురాలు మానుకోట రైల్వేస్టేçÙన్ సమీపంలో ఆగిఉన్న గూడ్సు రైలు నుంచి కింది నుంచి పట్టాలుదాటి, ఆ తర్వాత లూప్‌లైన్ దాటుతుండగా అదే సమయంలో ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్(డౌన్‌లైన్‌లో) రైలు ఆ వృద్ధురాలిని ఢీకొట్టింది. రైలుకింద పడటంతో ఆమె కాలు విరిగి అక్కడికక్కడే మృతిచెందిం ది. ఆమె వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఆమె చేతిపై పచ్చబొట్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మృతదేహాన్ని వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృ తురాలి బంధువులుగానీ కుటుంబ సభ్యులుగానీ స్థానిక ఏరియా ఆస్పత్రిలో లేక జీఆర్పీ పోలీస్‌స్టేçÙన్‌లో సంప్రదించాలాన్నారు.
Advertisement
Advertisement