![Spider Enters Old Women Ear And Spins Web Inside The Ear In China - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/30/spider.jpg.webp?itok=3AU_vASp)
చైనా: సాధారణంగా చెవిలోకి చీమలు, చిన్నగా ఉండే పురుగులు దూరితే చాలా ఇబ్బంది పడతాం. వాటిని చెవి నుంచి తీసే వరకు నొప్పి భరించలేము. అయితే తాజాగా చైనాలోని ఓ వృద్ధ మహిళ చెవిలో సాలీడు ఏకంగా గూడు కట్టుకుంది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఓ వృద్ధ మహిళకు చెవి నొప్పి, దురదగా ఉండటంతో పాటు, ఏదో మోగుతున్న శబ్దం రావటంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో ఆ మహిళ స్థానిక మియాన్యాంగ్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ లియూ.. ఆమె చెవిని పరిశీలించి.. చెవిలో పట్టు బంతి మాదిరిగా ఏదో ఉన్నట్లు గుర్తించారు. దీంతో చెవిలో ఏం ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో వృద్ధ మహిళ చెవిలో ఓ స్పైడర్ ఉన్నట్లు, అది చెవిలో చేరి గూడు కట్టుకున్నట్లు డాక్టర్ నిర్ధారణ చేశారు. (కరోనా కాలంలో ట్రంప్ ఊహించని నిర్ణయం)
దీంతో ఆ డాక్టర్ ఆమె చెవిలో.. చెవిని శుభ్రపరిచే రసాయనాన్ని చుక్కలుగా వేశారు. దీంతోపాటు ఆ స్పైడర్‌ను ప్రాణాలతో చెవి నుంచి బయటకు తీశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తు ఆ మహిళ చెవి దెబ్బతినలేదు.ఇక చెవిలోకి వెళ్లిన స్పైడర్ చాలా చిన్నదని, లేదంటే ఆమెకు వినికిడి లోపం కలిగేదని డాక్టర్ లియూ పేర్కొన్నారు. ‘నేను ద్రాక్షతోటలో పని చేస్తుంటాను. అదే సమయంలో నాకు ఎటువంటి స్పృహ లేకుండా ఆ సాలీడు నా చెవిలోకి దూరినట్టుంద’ని ఆ మహిళ తెలిపారు. కాగా, ఈ ఘటన ఏప్రిల్ 22న చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment