విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాకేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో ఓ వృద్ధురాలిని దోపిడీ దొంగలు హత్య చేశారు. హత్య అనంతరం ఆమె ఒంటిపై నగలు దోచుకెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వృద్ధురాలి హత్య..బంగారం అపహరణ
Published Mon, Nov 16 2015 9:06 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement