పింఛన్అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వృద్ధురాలు
అనంతపురం రూరల్: ‘టీడీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో మాకు పింఛన్లు అందకుండా చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎదుట పలువురు వృద్ధులు వాపోయారు. కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీలో మంగళవారం ఉదయం ‘ప్రకాష్‌తో ప్రతి ఉదయం’ కార్యక్రమాన్ని ప్రకాష్‌రెడ్డి నిర్వహించారు. కాలనీలోని వీధివీధినా తిరుగుతూ స్థానికులతో సమస్యలపై ఆయన ఆరా తీశారు.
ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు..
కాలనీ ఏర్పడి మూడు దశాబ్దాలు అవుతోందని, ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, అయినా ఈ నాలుగేళ్లలో ఒక్క ఇంటిని కూడా టీడీపీ ప్రభుత్వం మంజూరు చేయలేదంటూ ప్రకాష్‌రెడ్డితో కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
తీరని నీటి ఎద్దడి
కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పలువురు ఆరోపించారు. బిందెడు నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు. అందుతున్న అరకొర నీరుతో కనీస అవసరాలు తీరడం లేదన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని అన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటామన్నా.. మంజూరు చేయడం లేదని తెలిపారు. చాలా వీధుల్లో వీధి దీపాలు వెలగడం లేదని తెలిపారు.
జగన్ సీఎం అయితే సమస్యలు పరిష్కారం
ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చిస్తానని అన్నారు. మాయ మాటలతో ఓట్లు వేయించుకున్న వారికి తిరిగి అదే ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పీఏబీఆర్ పైప్‌లైన్ ద్వారా కాలనీ వాసులకు తాగునీటిని అందిస్తామంటూ ఎన్నికలకు ముందు పరిటాల సునీత హామీనిచ్చారని, అయితే నేటికీ నెరవేర్చలేకపోయారని అన్నారు. అయితే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ట్యాంకర్లు ఏర్పాటు చేసి కాలనీ వాసుల దాహార్తిని తీరుస్తున్నట్లు గుర్తు చేశారు. కక్కలపల్లి కాలనీని కార్పొరేషన్‌లోకి విలీనం చేస్తే ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. పేదలకు అండగా నిలిచిన తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కాలనీలో ప్రతి ఇంటికీ పీఏబీఆర్ ద్వారా నీటిని అందిస్తామని భరోసానిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయనరేంద్ర( రాజారాం), మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, మండల యువజన కన్వీనర్ వరప్రసాదరెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాసులు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు మాధవరెడ్డి, శ్రీనివాసులువడ్డే, వడ్డుపల్లి గోపాలరెడ్డి అక్కంపల్లి మాధవరెడ్డి, గుగ్గిళ్ల జయకృష్ణారెడ్డి, వడ్డే లింగమయ్య, బండి రవికుమార్, æఆనంధరెడ్డి, నాగభూషణరెడ్డి, చిన్నపరెడ్డి, రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బిస్కెట్ వెంకటేష్, యువరాజ్, కార్తిక్ రెడ్డి, రామిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రామాంజినేయులు, కేశవరెడ్డి, సిండికేట్ నగర్ ఆంజినేయులు(బండా), రాము, హనుమంతు, ఎద్దులపల్లి నారాయణస్వామి, శివ, రాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment