Davanagere
-
ఆమెకు వంట మాత్రమే తెలుసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. గాయత్రి సిద్దేశ్వర ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. మీకు మాట్లాడటం తెలియదు. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసు. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదు" అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర స్పందిస్తూ.. ప్రస్తుతం మహిళలు అన్నింటా రాణిస్తున్నారని, కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలి అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఇంట్లోని మగవాళ్లకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదన్నారు. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
ఆపరేషన్ చేసి కుట్లు మరిచారు
యశవంతపుర: వృద్ధ మహిళకు డాక్టర్ ఆపరేషన్ చేసి, కుట్లు వేయకుండా మరిచిపోయారు. ఈ సంఘటన దావణగెరెలో జరిగింది. దావణగెరె తాలూకా బుల్లాపురకు చెందిన అన్నపూర్ణమ్మ (65) కడుపునొప్పితో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. కానీ కోత కోసిన చోటకుట్లు వేయకుండా వదిలేశారు. ఆమె నొప్పితో బాధపడుతుండడంతో కొడుకు గమనించి వైద్యులను ప్రశ్నించగా ఏదో సాకు చెప్పారు. ఆపరేషన్ చేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకూ గాయం మానలేదని బాధితులు తెలిపారు. డాక్టర్లు అడిగినంత ఫీజులు చెల్లించామని చెప్పారు. చివరకు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. (చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు) -
Viral Video: టీచర్‌పై విద్యార్ధుల వీరంగం.. తలపై చెత్తబుట్ట బోర్లించి..
Karnataka School Students Attack on Teacher Video Viral: ‘ఆచార్య దేవో భవ’..అని సాధారణంగా అంటుంటారు. అంటే తల్లిదండ్రుల తరువాత గురువులు దేవుడితో సామానం అని అర్థం. గురువు తనకున్న జ్జానాన్ని పిల్లలకు బోధించి వారికి బంగారు భవిష్యత్తును అందిస్తాడు. భారతదేశంలో గురువుకి ఎంతో గొప్ప స్థానం ఉంది. కానీ చదువు చెప్పే గురువుపై కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో డిసెంబర్ 3న చోటుచేసుకుంది. దావణగెరే జిల్లా, చన్నగిరి టౌన్‌లోని నల్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోకి రాగానే ఉపాధ్యాయుడికి గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. క్లాస్ రూమ్‌లో క్ష్రమశిక్షణ పాటించాలని చెప్పినందుకు విద్యార్థులు తమ టీచర్‌ను దారుణంగా వేధించారు. టీచర్ వద్దకు వెళ్లి చెత్త బుట్టను ఆయన తలపై పెట్టి నానా హంగామా చేశారు. ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. చదవండి: 12 వేల బాతులను చంపేశారు! ఈ నేపథ్యంలో కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నాగేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. పాఠశాల విద్యార్థులు తమ టీచర్‌పై దాడి చేయడం సహించరానిదన్నారు. ఈ సంఘటనపై విద్యా శాఖ, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. తాము ఎల్లప్పుడూ టీచర్లకు మద్దతుగా ఉంటామమని, అమానవీయంగా ప్రవర్తించిన పిల్లలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు బాధిత టీచర్ పేర్కొన్నారు. చదవండి: రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ 🙌 https://t.co/5hf23oOwwN pic.twitter.com/rmrjuuZep4 — Samarth ⚡ (@SamarthAppu) December 11, 2021 -
ఒక్క తీరుగా ఉన్నారు.. ఎంత పనైపోయిందమ్మా
బెంగళూరు: అక్క, చెల్లి దారుణ హత్యకు గురైన ఘటన దావణగెరెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి సమీపంలోని అంజనేయ కాటన్ మిల్ లేఔట్లో ఈ ఘటన జరిగింది. హతులను బళ్లారి జిల్లా కూడ్లగి తాలూకా బెనకనహళ్లి గ్రామానికి చెందిన గౌరమ్మ (34), రాధిక (32)లుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కూలిపనులు చేసే వీరు మూడు రోజులుగా కనిపించలేదు. వీరి సమీప బంధువు చంద్రమ్మ పలుమార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో అనుమానంతో శుక్రవారం ఉదయం ఇంటికి వద్దకు రాగా దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. ఇటీవల గౌరమ్మ భర్త మంజునాథ్ ఇంటికి వచ్చి గొడవ పడినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
Lakshmi Venkatesh: చిన్నప్పట్నుంచీ ఉంది
నలభై మూడేళ్లు లక్ష్మీ వెంకటేశ్‌కి ఇప్పుడు. కర్ణాటకలోని దావణగెరె ఆమెది. బెంగళూరులోని ‘ఇండిజీన్’ కంపెనీ డేటా అండ్ ఎనలిటిక్స్ విభాగంలో సీనియర్ మేనేజర్. విషయం ఏంటంటే.. ఆరేళ్ల వయసులో ఆమె ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు లక్ష్మి! అవును. అలా లేకుంటే ఇప్పటికీ ఆమె డెంటిస్టుగానే ఉండిపోయేవారు. ఆమెను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనిపించవచ్చు. అందుకు కారణం.. ఆమె నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కనిపించడమే! నేర్చుకోవడంలో కిక్ ఉంది అంటారు లక్ష్మి. ఆరేళ్ల వయసులో తొలిసారి తల్లితో కలిసి యోగా సాధనకు వెళ్లింది లక్ష్మి. ఆసనాలన్నీ నేర్చుకున్న దశకు వచ్చాక ఇక ఆ అమ్మాయికి కొత్త ఆసనాలపైకి ధ్యాస మళ్లింది. అవీ నేర్చుకున్నాక ఇంకా ఏవైనా కొత్తవి ఉన్నాయా అన్నట్లు పచ్చికలో చాపను పరుచుకుని కూర్చొని యోగా గురువు కోసం ఎదురు చూస్తుండేది. నేర్చుకోవడమే జీవితం అన్నట్లుగా ఆనాటి నుంచి ఈనాటికి ఇండిజీన్ వరకు వచ్చేశారు లక్ష్మి. ఇండిజీన్ హెల్త్‌కేర్ సంస్థ. డెంటిస్టుగా జీవితం బాగా అలవాటైపోయి, డేటా ఎనలిస్టుగా ఇటువైపు వచ్చేశారు లక్ష్మి. 2000లో ఆమె దావణగెరెలోని బాపూజీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి డెంటల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత బెంగళూరులో డెంటల్ క్లినిక్ పెట్టి ఎనిమిదేళ్లు నడిపారు. రూట్ కెనాల్స్ చెయ్యడం, పళ్లు పీకడం, ఇతర దంత సమస్యల చికిత్స.. ఇదంతా బాగా బోర్ కొట్టేసింది డాక్టర్ లక్ష్మికి. ప్రాక్టీస్ బాగానే ఉంది. డబ్బు సమృద్ధిగానే వస్తుంది. కానీ అవి ఆమెను డెంటిస్టుగా కొనసాగేలా చేయలేకపోయాయి. ప్రొఫెషన్ వదిలేశారు. హాస్పిటల్ మేనేజ్మెంట్లో కోర్సు చేసి, తర్వాత రెండేళ్లపాటు క్లినికల్ రిసెర్చ్ చేశారు. ‘‘కొత్త కెరీర్లోకి వెళ్లడం కోసం కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇష్టం’’ అంటారు లక్ష్మి. నేర్చుకోవడం ఆమెకు సంతృప్తిని ఇస్తుందట. క్లినికల్ రిసెర్చ్‌లో ఉండగా 2009 లో ఆమె ఇండిజీన్లో ఎనలిస్టుగా సెలక్ట్ అయ్యారు. ఆమెకు పడిన మొదటి అసైన్మెంట్.. ‘ట్రైయల్ పీడియా’ను అభివృద్ధి పరచడం. అన్ని క్లినికల్ డేటాలకు అది ఊపిరితిత్తుల వంటిది. ఆ టాస్క్‌ని లక్ష్మి, ఆమె బృందం విజయవంతంగా పూర్తి చేశారు. మూడేళ్ల ఆ ప్రాజెక్టు మీద ఉన్నాక ఆమె డేటా ఎనలిటిక్స్ వైపు వెళ్లారు. తమ సంస్థ తరఫున అనేక ఫార్మా కంపెనీలకు ప్రాజెక్టులు చేసి పెట్టారు. వాటి కచ్చితత్వం కోసం లక్ష్మి, ఆమె టీమ్ కొత్త విషయాలను నేర్చుకోవలసి వచ్చింది. అది ఆమెకు ఇష్టమైన విద్యే కదా. ఇప్పుడు తను సీనియర్ మేనేజర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డేటాను ప్రాసెస్ చేస్తున్నారు. ఆ రంగంలోని కొత్త ఆవకాశాల కోసం కాదు కానీ, కొత్తగా నేర్చుకోవలసిన వాటి కోసం చూస్తున్నారు! -
12 కిలోమీటర్లు పరిగెత్తి పట్టేసింది!
బనశంకరి(కర్ణాటక): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు ఏకధాటిగా పరిగెత్తి పోలీసు జాగిలం నేరస్తుడిని పట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేరస్తుడిని పట్టుకోవడంలో తమకు సహకరించిన శునకాన్ని పోలీస్ బాస్‌లు సముచితరీతిలో సన్మానించారు. దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో ఉన్న తొమ్మిదేళ్ల తుంగా అనే డాబర్‌మెన్ శునకం రెండుగంటల్లో 12 కిలోమీటర్లు వెళ్లి హంతకుడి ఆచూకీ కనిపెట్టింది. చేతన్ అనే వ్యక్తి తన స్నేహితుడు చంద్రానాయక్ తదితరులతో కలిసి ధారవాడ జిల్లాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒక సర్వీస్ రివాల్వర్, బంగారు నగలు దోచుకెళ్లి అందరూ సమానంగా పంచుకున్నారు. కానీ చంద్రానాయక్ తనకు వాటా ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో చేతన్ ఆ సర్వీస్ రివాల్వర్‌తో అతన్ని కాల్చి చంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటనాస్థలాన్ని జాగిలం తుంగాతో కలిసి పరిశీలించారు. వాసన పసిగట్టిన తుంగా పరుగులు తీస్తూ రెండు గంటల తర్వాత కాశీపుర తాండాలో వైన్‌షాప్ వద్దకు వెళ్లి అక్కడ హోటల్ వద్ద నిలబడింది. సమీపంలోని ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా మొరగసాగింది. ఆ ఇల్లు చేతన్ బంధువుది కాగా, చేతన్ అక్కడే మొబైల్లో మాట్లాడుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ, హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడని చెన్నగిరి డీఎస్పీ ప్రశాంత్ మున్నోళ్లి తెలిపారు. పోలీసు జాగిలాలు గరిష్టంగా 8 కిలోమీటర్ల వరకూ వెళ్తాయి. కానీ తుంగా అంతదూరం వెళ్లడం గొప్ప విషయమని ఎస్పీ హనుమంతరాయ కొనియాడుతూ శునకాన్ని సన్మానించారు. తుంగా ఘనత కొద్ది నెలల క్రితమే దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో చేరిన తుంగా కీలక కేసులను ఛేదించడంలో ప్రధానపాత్ర పోషించింది. 30 హత్య కేసులతో 60 కేసుల్లో పోలీసులకు సహాయపడింది. ప్రతిరోజు ఉదయం 5 గంట నుంచే తుంగా దినచర్య ప్రారంభమతుంది. సుమారు 8 కిలోమీటర్ల వరకు నడక, జాగింగ్ చేస్తుంది. (చిరుత కోసం రిస్క్, ‘రియల్ హీరో’పై ప్రశంసలు) -
భర్తను కిడ్నాప్ చేయించిన భార్య
సాక్షి, బెంగళూరు: కట్టుకున్న భర్తను కిడ్నాప్ చేయించిన భార్యను, ఆమెకు సహకరించిన ఆరుగురు వ్యక్తుల్లో ఇద్దరిని దావణగెరె పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే దావణగెరె తాలూకా లోకికెరెలో శ్రీనివాస్, సంగీతాళ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌కు దావణగెరెలో భూమి, పెట్రోల్ బంక్ ఉంది. కొద్ది రోజుల క్రితం ఎస్ఐతో గొడవ పడిన సంగీతాళ విషం తాగింది. ఈ ఘటనపై కేసు నడుస్తోంది. మరో వైపు డబ్బు సమస్య ఎక్కువ కావటంతో భర్తను కిడ్నాప్ చేయించాలని పథకం పన్నింది. ఇందుకు ఆరుగురు వ్యక్తులతో కలిసి పథకం రచించింది. పెట్రోల్ బంక్ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాస్‌ను నిందితులు కిడ్నాప్ చేశారు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి సంగీతాళ ఫోన్ కాల్‌డాటాను సేకరించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కిడ్నాప్ ఉదంతం వెలుగు చూసింది. దీంతో సంగీతాళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి శ్రీనివాస్‌ను రక్షించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు. -
కోతి చేతికి స్టీరింగ్: బస్సు డ్రైవర్ని సస్పెండ్
-
వైరల్ వీడియో : కోతి చేతికి స్టీరింగ్
బెంగళూరు : ఈ మధ్య కాలంలో ఏదో ఒక చోట ఆర్టీసీ బస్సు లు ప్రమదాలకు గురవుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత సంఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ ఏకంగా కోతి చేతికి స్టీరింగ్ ఇచ్చి దాని వేషాలను చూస్తూ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కర్ణాటక ప్రభుత్వం సదరు బస్ డ్రైవర్ని విధుల నుంచి తొలగించింది. ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. వీడియోలో ఉన్న డ్రైవర్ పేరు ప్రకాష్. ఇతను దావణగేరె డివిజన్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న ప్రకాష్ దావణగేరె నుంచి భరమసాగర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోతి, దాని ట్రైనర్ రోజు ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటారని తెలిసింది. ఈ పరిచయం వల్ల కోతి స్టీరింగ్ మీద కూర్చునప్పటికి డ్రైవర్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా.. కోతి స్టీరింగ్ తిప్పుతుంటే అతను గేర్ మారుస్తూ వినోదం చూస్తున్నాడు. ఈ కోతి వేషాలను బస్సులోని ఓ ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీశాడు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఆ బస్సు డ్రైవర్ని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఈతకెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం
సాక్షి, దావణగెరె: ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని దావణగెరె నగరానికి సమీపంలోని ఆవరగెరెలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఈత కొట్టేందుకు ఆవరగెరెకు చెందిన గిరీష్(10), ధృవ(10)లు చెరువులోకి దిగారు. అయితే బురదలో చిక్కుకుని ఊపిరాడక మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులో గాలింపు జరిపి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యానగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
అమ్మలా పోషించి..ఓ అయ్య చేతిలో పెట్టి..
అనాథాశ్రమంలోని యువతులకు ‘కంకణభాగ్య’ మానవీయతను చాటుకుంటున్న దావణగెరె మహిళా నిలయం సాక్షి, బెంగళూరు: తల్లి ఎవరో..తండ్రి ఎవరో తెలియక అనాథ శరణాలయాల్లో మగ్గుతున్న యువతులు పెళ్లీడుకొస్తే వారిని ఓ అయ్య చేతిలో పెట్టడంలో శరణాలయాలు అంతగా బాధ్యతలు తీసుకోవు. వారి బాగోగులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. అయితే చిన్నతనంలోనే అందరినీ కోల్పోయి ప్రభుత్వ శరణాలయానికి చేరిన అమ్మాయిలను ‘అమ్మ’లా దగ్గరకు తీసుకుంటోంది దావణగెరెలోని మహిళా నిలయ. తమకంటూ ఎవరూ లేని అమ్మాయిలను పెంచే బాధ్యతనే కాదు, ఆ తర్వాత వారి పెళ్లి బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. అది కూడా తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోకుండా. దావణగెరెలోని మహిళా నిలయలో ఇప్పటికే ఈ తరహాలో 21పెళ్లిళ్లు జరగగా, శుక్రవారం రోజున మరో ఇద్దరు యువతులు అత్తవారింట్లో అడుగుపెట్టారు. కంకణభాగ్యతో పాటు 15వేల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా నేత్రావతి, అవిలాషాలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో దావణగెరె మహిళా నిలయలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిద్దరికీ మహిళా నిలయ ఆధ్వర్యంలో శుక్రవారం వివాహమైంది. యల్లాపుర తాలూకాలోని గోళిగద్దె గ్రామానికి చెందిన సుబ్బరాయ నారాయణ హెగ్డే నేత్రావతిని వివాహం చేసుకోగా, అంకోలా తాలూకాలోని కట్టేపాలకు చెందిన కుమార వెంకటరమణ హెబ్బార్ అవిలాషాను వివాహమాడారు. వీరి వివాహాన్ని దావణగెరె మహిళా నిలయ సభ్యులతో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారుల సమక్షంలో నిరాడంబరంగా, శాస్త్రోక్తంగా జరిపించారు. ఇక వధువుకు తాళిబొట్టు, మెట్టెలను అందజేయడంతో పాటు దంపతుల పేరిట 15వేలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. దీంతో దావణగెరె మహిళా నిలయంలో జరిగిన వివాహాల సంఖ్య 23కు చేరుకుంది. అబ్బాయి ఎంపిక ఇలా.... ఇక దావణగెరె మహిళా నిలయంలోని యువతిని వివాహం చేసుకోవాలనుకునే అబ్బాయిలు చాలా పరీక్షలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతి భద్రత దృష్ట్యా మహిళా నిలయం సభ్యులు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. మహిళా నిలయంలోని యువతిని వివాహం చేసుకోవాలనుకునే వారు ముందుగా మహిళా నిలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ చరిత్ర, పూర్తి వివరాలు, ఉద్యోగం తదితర అంశాలన్నింటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అనంతరం వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షలన్నింటిలో నెగ్గిన తర్వాతే వరుడి ఎంపిక జరుగుతుంది. -
రహదారులు రక్తసిక్తం
రెండు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం కల్వర్టును ఢీకొని... డీజిల్ ట్యాంకు పగిలి ఎగిసిన అగ్నికీలలు బెల్గాం జిల్లాలో మరో దుర్ఘటన... జాతర ముగించుకుని వస్తూ ట్రాక్స్ బోల్తా - ఐదుగురి దుర్మరణం రెండు వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం రాష్ర్టంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. చిత్రదుర్గం జిల్లాల్లో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. బెల్గాం జిల్లాలో జాతరకు వెళ్లి ట్రాక్స్ (క్రూజర్)లో వస్తుండగా, వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. చిత్రదుర్గం/చెళ్లకెర రూరల్/బెంగళూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం చెందారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా మేటికుర్కి వద్ద ఓ ప్రైవేట్ బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీ కొనడంతో మంటలు వ్యాపించి ఆరుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. అదే విధంగా బెల్గాం జిల్లాలో ఓ ట్రాక్స్ బోల్తా పడిన ప్రమాదంలో అయిదుగురు మరణించారు. పోలీసుల కథనం మేరకు ... దావణరెరెకు చెందిన ఏపీ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు ( కేఏ-01 సీ 7353) మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 29 మంది ప్రయాణికులతో దావణగెరె నుంచి బెంగళూరుకు బయల్దేరింది. మూడు గంటలకు మేటికుర్కి వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొంది. దీంతో డీజిల్ ట్యాంక్ పగిలి క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రాణభీతితో కిటికీ అద్దాలు పగులగొట్టి కొందరు, మెయిన్ డోర్ నుంచి మరికొందరు కిందకు దూకారు. కాగా అప్పటికే మంటల్లో చిక్కుకున్న ఆరుగురు అక్కడే సజీవ దహనమయ్యారు. కిందకు దూకే సమయంలో 19 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అదే ప్రాంతంలో ఉన్న కుమారస్వామి అనే వ్యక్తి హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించగా పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన సిరిసికి చెందిన అశ్వని, ఆమె కుమార్తె ఉదయ్ ప్రశాంత్, దావణగెరెకు చెందిన రాజ్‌కుమార్, రమేష్, గోసాబ్, అరసికెరకు చెందిన ప్రశాంత్‌బాబు, కుబేర, దుర్గేష్, ఊరి పేర్లు తెలియని ప్రశాంత్ కావళ్లి, గులాబ్ మహ్మద్, మహ్మద్ ఘోష్, మనీరా, మునీబా, నటరాజ్తోపాటూ మహ్మద్ ముస్తఫా, సంజయాచార్, కాశీనాథ్, మహ్మద్ శోయబ్, శ్రీప్రియా వీరిని హిరియూరు, దావణగెరె ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా సజీవ దహనమైన ఆరుగురి మృతదేహాలు గుర్తు పట్టని విధంగా కాలి బూడిద కావ డంతో వారి వివరాలు తెలియరాలేదు. అయితే మృతుల్లో ఒకరు మహిళ ఉన్నట్లు గుర్తించారు. డీఎన్ఏ పరీక్ష నిమిత్తం మృతదేహాలను బెంగళూరుకు తరలించారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బస్సు డ్రైవర్ ఫిరోజ్‌ను పోలీసులు హిరియూరులో అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి ఉంటే ప్రాణనష్టం తగ్గేదని ప్రత్యక్ష సాక్షి కుమారస్వామి తెలిపారు. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణం : బస్సులో రిజర్వేషన్ లేకుండానే పలువురు ప్రయాణించడంతో వివరాలు లభ్యం కాక మృతులు ఎవ రనేది గుర్తించేందుకు వీలు కావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. బస్సు దావణగెరెలో బయల్దేరిన తర్వాత నగర శివారు ప్రాంతంలో మరికొందరు ప్రయాణికులు బస్సులో ఎక్కారని, అందువల్ల వారి వివరాలు రిజర్వేషన్ చార్ట్‌లో లభ్యం కావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. జాతరకు వెళ్లి వస్తూ ఐదుగురు... బెంగళూరు : జాతరకు వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా వాహనం బోల్తాపడిన ఘనటలో ఐదుగురు దుర్మరణం చెందిన సంఘటన బెల్గాం జిల్లా దోడ్డవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం రాత్రి బెల్గాం జిల్లాలోని సవదత్తిలో యల్లమ్మ జాతర జరిగింది. బెల్గాం జిల్లా ఖానాపుర తాలుకా హలసి గ్రామానికి చెందిన సురేష్ కోలార్కర్,(42), శ్యామల కోలార్కర్ (55), లక్ష్మి కోలార్కర్ (38), మారుతి కోలార్కర్ (35), రాజీవ్ మ్కాగేరి (20)తో సహ 13 మంది ట్రాక్స్ (కూసర్) వాహనంలో సవదత్తిలోని యల్లమ్మ జాతరకు వెళ్లారు. మంగళవారం రాత్రి జాతర ముగించుకుని బుధవారం వేకువ జామున అందరూ ట్రాక్స్ వాహనంలో సొంతూరు హలసికి బయలుదేరారు. మార్గం మధ్యలో వేకువ జామున నాలుగు గంటల సమయంలో బైలహొంగల తాలుకా సుతగట్టి క్రాస్ సమీపంలో ట్రాక్స్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని బెల్గాం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. నిద్రమత్తులో వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మానవ జన్మ సార్థకతకు సాధన అవసరం
దావణగెరె, న్యూస్‌లైన్ : మానవ జన్మ సార్థకతకు సాధన ఎంతో అవసరమని విరక్తమఠం బసవ ప్రభు స్వామీజీ అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని ఎస్జేఎం పబ్లిక్ స్కూల్, శ్రీ బక్కేశ్వర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సాహస ప్రదర్శన కార్యక్రమాన్నుద్దేశించి మాట్లాడారు. నేటి యువత కేవలం సరదాలు, సంబరాలతో తమ జీవితాలను పాడు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఏమీ సాధించలేమనే నిస్సహాయ భావాన్ని విడనాడి ఏదైనా సాధిస్తామనే మనోభావాన్ని పెంచుకోవాలన్నారు. ఏదైనా సాధన చేయాలంటే అందుకు కఠోర ప్రయత్నం, కృషి అవసరమన్నారు. మొదటి ప్రయత్నంలో విఫలమైతే తన వల్ల కాదనుకోరాదని, మళ్లీ ప్రయత్నిస్తే సాధించడం తథ్యమన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ వర్మ తన దంతాలతో 45 సెకన్లలో రెండు కొబ్బరికాయల పీచు వలిచి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అలాగే 80 కేజీల బరువున్న బియ్యం బస్తాను పళ్లతో పెకైత్తాడు. చెవికి తాడు కట్టుకుని మారుతి 800 కారును లాగుతానని, నడుస్తున్న బైక్‌పై ఒక బకెట్ నీళ్లతో స్నానం, భోజనం చేసే సాహసాలను కూడా చేయగలనని యన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్యా నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.