మైసూరు(బెంగళూరు): బాలిక కడుపులో ఉండలా పేరుకుపోయిన అరకేజీ వెంట్రుకల ఉండను వైద్యులు ఎండో స్కోపీ ద్వారా బయటకు తీసి స్వస్థత చేకూర్చారు. 11 సంవత్సరాల వయసున్న బాలిక తన తల్లిదండ్రలకు తెలియకుండా తల వెంట్రుకలను పీక్కొని తినేది. ఈ క్రమంలో 8 నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు.
మైసూరులోని అపోలో అస్పత్రికి తీసుకెళ్లగా బాలల గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అతీరా రవింద్రనాథ్ బాలికకు వైద్య పరీక్షలు చేయగా కడుపులో వెంట్రుకలు ఉన్నట్లు తేలింది. ఎండోస్కోపీ సాయంతో బయటకు తీసి ఉండను తూకం వేయగా 500 గ్రాముల బరువు 5 సెంటి మీటర్ల పొడవు ఉన్నట్లు తేలింది. బాలిక ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చదవండి: న్యూ ఇయర్ పార్టీలో తుపాకీతో కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment