సాక్షి, హైదరాబాద్: చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ చేరికలను కాంగ్రెస్ నేతలతో కాకుండా న్యూట్రల్ పర్సన్స్‌తో ఆపరేషన్ ఆకర్షగా కంప్లీట్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో చర్చలు పూర్తయినట్లు సమాచారం.
వరంగల్ మోదీ సభ రోజే ఒకరిద్దరు కీలక నేతలను చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ చేసింది. ప్రియాంక హాజరుకానున్న సభలో మరికొందరు కీలక నేతలను చేర్చుకునే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. యెన్నంశ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్‌రావు, ఖాజీపేట లింగయ్య, పవన్‌కుమార్‌రెడ్డి, రమేష్ రాథోడ్, రవీంద్రనాయక్, తీగల కృష్ణారెడ్డిలతో మంతనాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ నేతలు కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడంపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డికి ఘర్ వాపసిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు.
చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ!
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. రాజకీయ వర్గాలు ముందుగా ఊహించినట్టుగానే ఖమ్మం గడ్డపై నుంచి ఆ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ జనం నడుమ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల ప్రచార సభను తలపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment