అభిమానం వెర్రితలలు వేస్తే ‘ఫ్రాన్ మారియానో’లా ఉంటుంది. అతను అర్జంటీనా వాసి. స్పానిష్ (ప్యుర్టో రికా) గాయకుడు, పాటల రచయిత, నటుడు రికీ మార్టిన్ వీరాభిమాని! సాధారణంగా అయితే సెలబ్రిటీల అభిమానులు.. సెలబ్రిటీల అభినయ, ఆహార్య, వాచకాలను అనుకరిస్తూ ఆనందపడుతుంటారు. కానీ ఫ్యాన్ ఫ్రాన్ మారియానో మాత్రం తన రూపు రేఖలనే మార్చేసుకున్నాడు కనుబొమలు సహా! అచ్చం రికీలాగే కనిపించాలనే కోరికతో ఏకంగా డజన్‌కి పైగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నాడు.
తన కనుబొమలు కూడా రికీ మార్టిన్ కనుబొమలను పోలి ఉండాలని మోటార్ ఆయిల్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. ఈ ప్రకియంతా అతన్ని త్రీవమైన శారీరక, మానసిక వ్యధలోకి నెట్టింది. ఇప్పుడు అతను ఇటు తనలా కాకుండా అటు రికీ మార్టిన్‌లా కాకుండా తయారయ్యాడు. ఈ మధ్యే ఓ రియాలిటీ షో (అర్జంటీనా)లో తనలాంటి ఫ్యాన్స్‌కి తన అనుభవాన్ని చెబుతూ ఏ అభిమానీ తనలా మారొద్దని.. అభిమానాన్ని హద్దులు మీరనివ్వద్దని హెచ్చరించాడు.
‘నా ముక్కు, మూతి నావి కాకుండా పోయాయి. నా సగం మొహానికి స్పర్శే తెలియడం లేదు. మంచినీళ్లనూ గటగటా తాగలేని పరిస్థితి.. కర్చీప్‌ని నీళ్లలో ముంచి నోట్లో పిండుకోవాల్సి వస్తోంది’ అని వాపోతున్నాడు మారియానో. ఇతని గాథ విన్నవాళ్లంతా ‘ప్చ్ .. క్రేజీ ఫెలో.. ’ అంటూ జాలిపడుతున్నారు.
చదవండి: ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment