
సాక్షి, హైదరాబాద్: రోగి కిడ్నీలో ఏర్పడిన 206 రాళ్లను వెలికితీసి అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. గురువారం సదరు ఆస్పత్రి వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య (56) ఆరు నెలలుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయన గత నెల ఎల్‌బీనగర్‌లోని అవేర్ ఆస్పత్రిలో చేరాడు. యూరాలజీ సీనియర్ వైద్యుడు పూల సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో రామలక్ష్మయ్యకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
వైద్యులు రామలక్ష్మయ్యకు కీ హోల్ శస్త్ర చికిత్స చేసి గంట సేపట్లోనే కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. ఎండకాలం డీహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటుందని, ఎండలో అధికంగా తిరగ డం కారణంగా సమస్య వస్తుందన్నారు. నీరు, జ్యూస్ అధిక మొత్తంలో తీసుకోవాలని వైద్యు లు సూచించారు. నీటి శాతం తక్కువ అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని పేర్కొన్నారు.
చదవండి: పెళ్లి చూపులకు వచ్చిన వారు ఎవరూ ఒప్పుకోవడం లేదని
Comments
Please login to add a commentAdd a comment