తిరుమల: తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి.
చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు. చిన్న పిల్లలను దగ్గరే పెట్టుకొని వెళ్లాలని సూచిస్తోంది. చిరుతల దాడుల నియంత్రణకు నిపుణులు కమిటీ ఏర్పాటు చేశారు. చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది టీటీడీ.
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: విశాఖ కారాగారంలో అన్నీ నదులే..!
Comments
Please login to add a commentAdd a comment